బులియన్ మార్కెట్‌లో కరోనా వైరస్ ప్రభావం ఏ మాత్రం లేదు. లాక్‌డౌన్ నేపథ్యంలోనూ గత రెండు వారాల్లో బంగారం, వెండి ధరలు (Gold Rates Today) భారీగా పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గకపోవడం గమనార్హం. జ్యువెలర్ల విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,090కి ఎగబాకింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.266 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.40,416కి చేరుకుంది. Must Read: పింఛన్‌లో 30% కోత పడనుందా!
నేడు ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు పుంజుకున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.700 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.44,960కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.270 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.42,560కి ఎగిసింది. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
కాగా, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. 1కేజీ వెండి రూ.100 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.41,100కి చేరుకుంది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..