షాక్! బంగారం ధరలు పైపైకి.. దిగొచ్చిన వెండి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Price Today) పుంజుకోగా, వెండి ధరలు మరోసారి పతనమయ్యాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 24, 2020, 07:24 AM IST
షాక్! బంగారం ధరలు పైపైకి.. దిగొచ్చిన వెండి

గత రెండు రోజులు స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధర నేడు పెరిగింది. బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Price Today) పుంజుకోగా, వెండి ధరలు మరోసారి పతనమయ్యాయి. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు తులం (10 గ్రాముల) బంగారం ధర రూ.680 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,780కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.650 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,050కి జంప్ అయింది. కరోనా కేసులే లేని దేశాలివే..

నేడు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు ఓ మోస్తరుగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.44,900కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.310 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  రూ.42,160 వద్ద ట్రేడ్ అవుతోంది. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!  

నేడు బంగారం ధరలు ఓ మోస్తరుగా పెరగగా, వెండి ధరలు మళ్లీ పతనమయ్యాయి. 1కేజీ వెండిపై రూ.240 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.41,410కి పడిపోయింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News