బులియన్ మార్కెట్లో నేడు ధరలు పుంజుకున్నాయి. గత రెండు రోజుల్లోనే దాదాపు రూ.1800 మేర బంగారం ధరలు తగ్గాయి. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’పై సర్వేలో షాకింగ్ విషయాలు!
హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు తులం (10 గ్రాముల) బంగారం ధర అతి స్వల్పంగా రూ.10 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,210కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40,520అయింది. PHotos: హెబ్బా.. అందాలు చూస్తే అబ్బా!
నేడు ఢిల్లీ మార్కెట్లోనే బంగారం ధరలు అతి స్వల్పంగా రూ.10మేర పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.44,550కి ఎగసింది. 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం సైతం అంతే పెరగడంతో 10 గ్రాముల ధర రూ.41,990 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆమె అందాలకు నెటిజన్లు LockDown
కాగా, గత రెండు రోజులుగా తగ్గిన వెండి ధరలు నేడు అతి స్వల్పంగా పెరిగాయి. 1కేజీ వెండి రూ.10 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.41,160కి చేరుకుంది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..