బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు పుంజుకున్నాయి. లాక్‌డౌన్ టైమ్ కొనసాగుతున్నా బంగారం ధరలు వరుసగా తొమ్మిదో రోజు పెరిగాయి. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు తులం (10 గ్రాముల) బంగారం ధర రూ.210 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.45,970కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.140 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.42,100అయింది. ఐటమ్ గాళ్ నటాషా లేటెస్ట్ ఫొటోలు
నేడు ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు ఓ మోస్తరుగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.190 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.46,100కి ఎగసింది. 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.210మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.43,860కి చేరుకుంది.
కాగా, బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోగా, వెండి ధరలు మాత్రం అతి స్వల్పంగా పెరిగాయి. 1కేజీ వెండి రూ.40 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.41,890కి చేరుకుంది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..