నేటి బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్‌లో నిన్న బంగారం ధరలు భారీగా తగ్గగా, నేడు ధరలు పుంజుకున్నాయి. ఈ వారం మొదట్లో ఎట్టకేకలకు బంగారం ధర రూ.49 వేల మార్కును చేరుకుంది.

Written by - Shankar Dukanam | Last Updated : May 25, 2020, 01:36 PM IST
నేటి బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్‌లో నిన్న బంగారం ధరలు భారీగా తగ్గగా, నేడు ధరలు పుంజుకున్నాయి. ఈ వారం మొదట్లో ఎట్టకేకలకు బంగారం ధర రూ.49 వేల మార్కును చేరుకుంది. ప్రస్తుతం దాదాపు అదే ధరలో కొనసాగుతోంది.

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.310 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,990కి ఎగసింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.410 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.45,280కి చేరుకుంది. Photos: రానా, మిహికా రోకా వేడుక.. ఫొటో గ్యాలరీ

ఢిల్లీ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. నిన్న రూ.300 మేర తగ్గిన బంగారం ధర నేడు రూ.210 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,910కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.46,100కి ఎగసింది.  విమాన ప్రయాణికులకు మార్గదర్శకాలు విడుదల

బులియన్ మార్కెట్‌లో నేడు వరుసగా రెండోరోజూ వెండి ధర పెరిగింది. నేటి మార్కెట్‌లో రూ.100 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర ధర రూ.48,350కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా వెండికి ఇదే ధర ఉంటుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Trending News