Tirath Singh Rawat Named Uttarakhand New CM: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన 24 గంటలలోపే నూతన సీఎంగా తీరత్ సింగ్ రావత్ ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం సాయంత్రం 4 గంటలకు తీరత్ సింగ్ రావత్ చేత రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్యకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. నేటి ఉదయం డెహ్రాడూన్‌లోని బీజేపీ పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో తీరత్ సింగ్ రావత్‌ను తదుపరి సీఎంగా నిర్ణయించారు.
బీజేపీ లెజిస్లేచరీ పార్టీ మీటింగ్ అనంతరం సీఎం పదవి నుంచి తప్పుకున్న త్రివేంద్ర సింగ్ రావత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తరాఖండ్(Uttarakhand) బీజేపీ అధ్యక్షుడుగా 2013 నుంచి 2015 డిసెంబర్ వరకు రెండేన్నరేళ్లపాటు తీరత్ సింగ్ పార్టీ బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో శాసనసభ్యుడిగా సేవలు అందించిన ఆయన ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగా సేవలు అందిస్తున్నారు. కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్, మంత్రి ధాన్ సింగ్ రావత్ సూచన మేరకు ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు తీరత్ సింగ్ రావత్‌ను తమ నేతగా ఎన్నుకున్నారని సమాచారం.
మరోవైపు మరికొన్ని రోజులలో నాలుగేళ్లు పదవికాలం పూర్తి కానున్న సమయంలో త్రివేంద్ర సింగ్ రావత్ ఉత్తరాఖండ్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. గత కొంతకాలం నుంచి బీజేపీ కేంద్ర అధిష్టానానికి త్రివేంద్ర సింగ్ రావత్‌పై ఫిర్యాదులు అందుతున్నాయి. పార్టీ మరోసారి అధికారంలోకి రావాలన్నా, పార్టీలో అసంతృప్తులను శాంత పరిచేందుకు బీజేపీ అధిష్టానం నూతన సీఎం దిశగా అడుగులు వేసింది.
కొన్ని రోజుల కిందట బీజేపీ అధిష్టానం పంపిన నేతలు రాష్ట్ర బీజేపీ ఎమ్మె్ల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక పంపించారు. ఆ నివేదిక పరిశీలించిన అనంతరం త్రివేంద్ర సింగ్ రావత్‌ను ఢిల్లీని ఆహ్వానించారు. సోమవారం నాడు ఢిల్లీ వెళ్లిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్(Trivendra Singh Rawat) బీజేపీ కీలక నేతలను కలుసుకున్నారు. బీజేపీ కేంద్ర అధిష్టానం సూచన మేరకు త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. డెహ్రాడూన్‌లో గవర్నర్ బేబే రాణి మౌర్యను కలుసుకుని తన రాజీనామా లేఖను సమర్పించడం చకచకా జరిగిపోయాయి.
అయితే సీఎం పదవికి ఇద్దరు సీనియర్ నేతల పేర్లు తెరమీదకి వచ్చాయి. అజయ్ భట్, అనిల్ బలూనిలకు అవకాశం దక్కనుందని వినిపిస్తోంది. వీరిద్దరూ పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనాతో ఈ ఇద్దరు కీలక నేతలకు ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం అవకాశం ఇవ్వనుందని ఆ రాష్ట్రంలో చర్చ మొదలైందని పీటీఐ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook