Delhi Terror Attack: ఇండియాలో మరోసారి ఉగ్రదాడులకు అవకాశం, డిల్లీలోని ముఖ్య ప్రాంతాలు టార్గెట్

Delhi Terror Attack: దేశంలో మరోసారి ఉగ్రదాడులు జరగనున్నాయనే వార్త ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలపై ఈ ఉగ్రదాడులు జరగవచ్చని సమాచారం అందుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 4, 2021, 06:06 PM IST
  • దేశంలో మరోసారి ఉగ్రదాడులకు కుట్ర, అప్రమత్తమైన భద్రతా బలగాలు
  • దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ముఖ్య ప్రాంతాలు లక్ష్యంగా ఉగ్రదాడులు జరగవచ్చనే సమాచారం
  • ఢిల్లీలోని ఇజ్రాయిల్ పౌరులు లక్ష్యంగా ఉగ్రదాడులకు ఆస్కారం
Delhi Terror Attack: ఇండియాలో మరోసారి ఉగ్రదాడులకు అవకాశం, డిల్లీలోని ముఖ్య ప్రాంతాలు టార్గెట్

Delhi Terror Attack: దేశంలో మరోసారి ఉగ్రదాడులు జరగనున్నాయనే వార్త ఆందోళన కల్గిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలపై ఈ ఉగ్రదాడులు జరగవచ్చని సమాచారం అందుతోంది.

ఇండియాలో ఉగ్రదాడులు(Terror Attacks) జరగవచ్చని ఇంటెలిజెన్స్ వ్యవస్థ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలు ఉగ్రదాడులకు లక్ష్యంగా ఉన్నాయని తెలుస్తోంది. ఢిల్లీలోని ఇజ్రాయిల్ పౌరులు లక్ష్యంగా దాడులు జరగవచ్చనేది సమాచారం. ఈ హెచ్చరికల నేపధ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న జెవిష్ హాలిడే సందర్భంగా దాడులు జరగవచ్చు. 

ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) పరిస్థితులు ఓ వైపు ఆందోళన కల్గిస్తుంటే మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) ఓ అతిపెద్ద ఉగ్రకుట్ర బహిర్గతమైంది. ఢిల్లీలో నివాసముంటున్న ఇజ్రాయిల్ పౌరులే లక్ష్యంగా ఈ ఉగ్రదాడులు జరగవచ్చని తెలుస్తోంది. ఉగ్రవాదులు మరోసారి యూదుల్ని లక్ష్యంగా చేసుకోనున్నారు.ఈ సమాచారంతో భద్రతా బలగాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జెవిష్ హాలిడే పురస్కరించుకుని దాడులు జరగవచ్చు. ఆఫ్ఘన్ పరిణామాల నేపధ్యంలో భద్రతా బలగాలు పూర్తిగా అప్రమత్తమై..ఎప్పటికప్పుడు హెచ్చరికల్ని జారీ చేస్తున్నాయి. ఢిల్లీలో ఇజ్రాయిల్(Izrael) పౌరులు ఎక్కువగా నివసించే కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్ని టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం. 

ఢిల్లీలో ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్న ప్రాంతాలు

ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం
రాయబార కార్యాలయం సిబ్బంది
కోషెర్ హోటల్
సైనా గోగ్స్ హోటల్
జెవిష్ కమ్యూనిటీ సెంటర్
చాబడ్ హౌస్

ఉగ్రదాడుల గురించి సమాచారం అందిన తరువాత నిఘా ఏజెన్సీలకు సమాచారాన్ని చేరవేశారు. ఆ తురవాత భద్రతా బలగాలు అప్రమత్తమై భద్రతా వ్యవస్థను పటిష్టం చేశారు. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ప్రాంతంలో భత్రతను పెంచారు. గతంలో కూడా యూదులు లక్ష్యంగా మారిన పరిస్థితులున్నాయి. 2021 జనవరిలో ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం సమీపంలో బాంబు పేలుళ్లు జరిగాయి. అయితే ఆ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ ఎవర్నీ అరెస్టు కూడా చేయలేదు. మరోవైపు 2012 ఫిబ్రవరి 13న ఇజ్రాయిల్ రాయబారి కారుపైదాడి జరిగింది.

Also read: West Bengal Bypoll: భవానీపూర్ నుంచి దీదీ పోటీకు సిద్ధం, సెప్టెంబర్ 6న నోటిఫికేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News