కరుణానిధికి కడసారి వీడ్కోలు పలికేందుకు చెన్నై వెళ్లనున్న సీఎం కేసీఆర్

కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చెన్నై వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్

Last Updated : Aug 7, 2018, 09:20 PM IST
కరుణానిధికి కడసారి వీడ్కోలు పలికేందుకు చెన్నై వెళ్లనున్న సీఎం కేసీఆర్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకె అధినేత కరుణానిధి మృతితో తమిళనాడు శోక సంద్రంలో మునిగిపోయింది. 94 ఏళ్ల రాజకీయ కురువృద్ధుడికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులు చెన్నైకి బయల్దేరారు. కళైగర్ కరుణానిధి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణానిధి మృతికి సంతాపం ప్రకటించిన కేసీఆర్.. ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి మృతి దేశ రాజకీయాలకు తీరని లోటు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కరుణానిధి అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాల మధ్య జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు చెన్నై వెళ్లి కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. 

కరుణానిధికి కడసారి వీడ్కోలు పలికేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం చెన్నై వస్తున్నట్టు సమాచారం. 

Trending News