Dhoni's Wife Sakshi Questioned Jarkhand Govt on Power Crisis: జార్ఖండ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం పెరిగిపోతోంది. రాష్ట్రంలో విద్యుత్ అవస్థలపై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి రాష్ట్ర ప్రభుత్వంపై సంధించిన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.
జార్ఖండ్‌లో ఓ వైపు ఎండ వేడిమి మరోవైపు పెరుగుతున్న విద్యుత్ సంక్షోభంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఉక్కపోత భరించలేక..బయటి పనులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి కొన్ని ప్రశ్నలు సంధించింది. జార్ఖండ్‌లో ఇన్నేళ్ల నుంచి విద్యుత్ సంక్షోభం ఎందుకుందని ట్వీట్ ద్వారా ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
జార్ఖండ్‌లో విద్యుత్ కోతల కారణంగా జనం ఇబ్బంది పడుతుండటంతో ట్వీట్ ద్వారా సాక్షి ప్రశ్నించింది. జార్ఘండ్‌లో ఇంతకాలం నుంచి విద్యుత్ సంక్షోభం ఎందుకుందని. మనవంతుగా మనం విద్యుత్ పొదుపు చేస్తున్నామా లేదా అని కూడా ట్వీట్ చేసింది. సాక్షి ఇంతకుముందు ఏడాది క్రితం చివరి ట్వీట్ చేసింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటోంది. రాష్ట్రంలోని పశ్చిమ సింహభూమ్, కోడ్రమా, గిరిహీడ్ జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. ఏప్రిల్ 28 వరకూ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగనుందని అంచనా.
ఎండల వేడి పెరగడంతో కరెంట్ లోడ్ పెరుగుతోంది. దాంతో జార్ఖండ్ నగరాల్లో రోజుకు 5 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 7 గంటలు విద్యుత్ కోత ఉంది. అందుకే సాక్షి చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also read: Frustration on Ola: ఓలా స్కూటర్‌పై వినూత్నరీతిలో నిరసన, గాడిదకు కట్టి ఊరేగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.