Tamilnadu Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు తోడు..కమల్ హాసన్ , శశికళలు. మరోవైపు నాటి సినీ నటి రాధిక ఎన్నికల బరిలో దిగనున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ( Tamilnadu Assembly Elections ) ఈ ఏడాది ఆసక్తి రేపనున్నాయి. మహామహులు బరిలో నిలవనున్నారు. అధికార పార్టీ ఏఐఏడీఎంకే ( AIADMK ), ప్రతిపక్షం డీఎంకే ( DMK ) లు ఇప్పటికే హోరాహోరీ తలపడనుండగా..కమల్ హాసన్ ( Kamal Haasan ) పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇక ఇటీవల జైలు నుంచి విడుదలైన శశికళ ( Sasikala ) తమిళ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నేపధ్యంలో ఎస్ఎంకే నేత నటుడు శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రముఖ నటి, తమిళుల ఆరాధ్య నటీమణి ఖుష్బూ ( Khushboo ) బీజేపీ ( Bjp ) లో చేరడంతో తమిళ రాజకీయం ఈసారి గ్లామరస్‌గా మారింది.
తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య, నాటి మేటి నటి రాధిక ( Veteran actress Radhika ) పోటీ చేయనున్నారని శరత్ కుమార్ ప్రకటించారు. ఇప్పటికే రాధిక ఎస్ఎంకే పార్టీ మహిళా విభాగం ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఏఐఏడీఎంకే కూటమిలోనే ఉన్నామని..ఎక్కువ సీట్లు ఆశిస్తున్నామని శరత్ కుమార్ తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి శ్రమించిన కరాటే త్యాగరాజన్..రజనీకాంత్ ( Rajnikanth )పార్టీ ప్రకటన కోసం చూశారు. అది కార్యరూపం దాల్చకపోవడంతో బీజేపీలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇంకోవైపు రాహుల్ గాంధీ ( Rahul gandhi taminadu tour ) తమిళనాడు పర్యటన తొలి విడత ఇప్పటికే ముగిసింది. రెండో విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 14 నుంచి 6 జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. రాహుల్ గాంధీ తన పర్యటనలో భాగంగా తమిళ సాంప్రదాయ గ్రామీణ వంటలు తింటూ అందర్నీ ఆకర్షించే ప్రయత్నం చేశారు.
Also read: Tamil nadu: శశికళపై ఆరేళ్ల నిషేధం తొలగేనా..ఎన్నికల్లో పోటీ పరిస్థితి ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook