TamilNadu CM comments on three language policy: చెన్నై: కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం - 2020 లోని మూడు భాషల సూత్రాన్ని తమిళనాడు ( TamilNadu ) రాష్ట్రం వ్యతిరేకిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళనిస్వామి ( Edappadi K. Palaniswami ) ప్రకటించారు. తాము నూతన విద్యా విధానాన్ని ఏ మాత్రమూ అమలు చేయమని, ద్విభాష సూత్రాన్నే తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఆయన సోమవారం స్పష్టం చేశారు. ఈ విధానం తమకు అత్యంత బాధతోపాటు విచారాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. Also read: RBI Vacancy 2020: ఆర్బీఐలో ఉద్యోగ అవకాశాలు
నూతన విధానంపై మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. నూతన విద్యా విధానంలోని త్రి భాషా సూత్రం అత్యంత బాధాకరమని, దీనిని పునరాలోచించుకోవాలని ప్రధాని మోదీకి సూచించారు. అయితే.. తమిళనాడు ప్రజలు.. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ద్విభాష విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇష్టపడతాయని, తమ మనోభావాలను పరిగణనలోకి తీసుకోని.. తమ సొంత భాషా విధానాన్ని అమలు చేయడానికి అనుమతించాలని సీఎం పళనిస్వామి కోరారు. IPL 2020 FANS: క్రికెట్ అభిమానులకు శుభవార్త