Rajinikanth: చంద్రబాబుని రజినీకాంత్ ఎందుకు కలవలేదంటే, కారణమిదేనట

Rajinikanth: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడిని కలిసే విషయంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ స్పష్టత ఇచ్చేశారు. చంద్రబాబుపై మరోసారి ప్రశంశలు కురిపించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 17, 2023, 01:08 PM IST
Rajinikanth: చంద్రబాబుని రజినీకాంత్ ఎందుకు కలవలేదంటే, కారణమిదేనట

Rajinikanth: రాజమండ్రి సెంట్రల్  జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుని తమళ సూపర్‌స్టార్ రజినీకాంత్ కలవనున్నారనే ప్రచారం రెండ్రోజుల్నించి జరుగుతోంది. ఈ విషయంపై స్వయంగా ఆయన ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. 

ఏపీ స్కిల్ డెలవప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు కుటుంబీకులు ఆయనను జైలులో ములాఖత్ సందర్భంగా రెండుసార్లు కలిశారు. మరోవైపు చంద్రబాబు ఆప్తమిత్రుడిగా ఉన్న తమిళ సూపర్‌స్టార్ రజినీ కాంత్ ఈ విషయంపై నారా లోకేశ్‌తో మాట్లాడి పరామర్శించారు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్ని ఆయన అధిగమిస్తారంటూ లోకేశ్‌కు ధైర్యం చెప్పారు. అక్రమ అరెస్టులు, కేసులు చంద్రబాబును ఏం చేయలేవని, ఆయన చేసిన మంచి పనులే క్షేమంగా బయటకు తీసుకొస్తాయని వివరించారు. 

అయితే గత రెండ్రోజుల్నించి ఆయనే స్వయంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి చంద్రబాబును కలవనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ దీనిపై స్పష్టత లేదు. చెన్నై విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు ఇదే విషయాన్ని రజినీకాంత్‌ను అడగడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబుని కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎప్పుడు వెళ్తున్నారని అడిగారు. చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వెళ్లాలనుకున్నానని..అయితే ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా కుదరలేదని తెలిపారు.

చంద్రబాబుకు, రజినీకాంత్‌కు మధ్య చాలాకాలంగా మంచి సంబంధాలున్నాయి. అందుకే ఇటీవల టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో చంద్రబాబు పాలనపై రజినీకాంత్ ప్రశంసలు కురిపించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ రాష్ట్రంలో టీడీపీ వర్గాలు ఓ వైపు ఆందోళనలు కొనసాగిస్తూనే, మరోవైపు త్వరగా విడుదల కావాలని ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు.

Also read: Birth Certificate Rule: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇది తప్పనిసరి!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News