Banwarilal Purohit: తమిళనాడు గవర్నర్‌కు కరోనా నెగిటివ్

తమిళనాడు (tamil nadu) గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ (Banwarilal Purohit ) ఆగస్టు 2న  కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం కరోనావైరస్ (Coronavirus) నుంచి కోలుకున్నారు. 

Last Updated : Aug 15, 2020, 09:17 AM IST
Banwarilal Purohit: తమిళనాడు గవర్నర్‌కు కరోనా నెగిటివ్

Covid-19 Negative: చెన్నై: తమిళనాడు ( Tamil Nadu) గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ (Banwarilal Purohit ) ఆగస్టు 2న  కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం కరోనావైరస్ ( Coronavirus ) నుంచి కోలుకున్నారు. శుక్రవారం జరిపిన పరీక్షల్లో గవర్నర్ భన్వరీలాల్‌కు కరోనా నెగిటివ్‌గా తేలినట్లు చెన్నైలోని కావేరి ఆసుపత్రి వైద్యులు చెప్పారు. 80ఏళ్ల గవర్నర్ పురోహిత్ కరోనా నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. గతంలో పురోహిత్‌కు కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లోనే ఉంచి కావేరీ ఆసుపత్రి వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. Also read: Aatmanirbhar Bharat: ఆత్మనిర్భర్ భారత్ ప్రయోజనాలపై ప్రధాని మోదీ కీలక ప్రసంగం

తమిళనాడు రాజ్‌భవన్‌లో 84 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. దాదాపు 13రోజుల అనంతరం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. Also read: Lav Agarwal: కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీకి కరోనా

Trending News