'ప్లీజ్.. సుష్మాను తిట్టకండి'

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు  భర్త స్వరాజ్‌ కౌశల్‌ అండగా నిలిచారు.

Last Updated : Jul 2, 2018, 10:11 AM IST
'ప్లీజ్.. సుష్మాను తిట్టకండి'

కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు  భర్త స్వరాజ్‌ కౌశల్‌ అండగా నిలిచారు. సుష్మాపై ట్విట్టర్‌లో వస్తున్న ఆరోపణలపై  స్వరాజ్ కౌశల్ బావోద్వేగానికి లోనవుతూ స్పందించారు. 'సుష్మాకు.. కుటుంబం అంటే ఎంతో ప్రేమ. నా తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే ఆమే ఏడాదిపాటు  దగ్గరుండి చూసుకుంది. నా తండ్రి చివరి కోరిక మేరకు ఆమెనే చితికి నిప్పు పెట్టింది. ఆమెకు కుటుంబం అంటే ఎంతో బాధ్యత' అని ట్వీట్ చేసి.. ప్లీజ్ ఆమెను తిట్టకండి అని కోరారు.

ఓ జంటకు పాస్‌పోర్ట్‌ జారీ చేసిన వ్యవహారంలో ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విషయం విదితమే. లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్టులు జారీ అయ్యేందుకు సహకరించటం, వారిని ఇబ్బందిపెట్టిన అధికారిని బదిలీ చేయటంతో సుష్మా స్వరాజ్‌పై పలువురు మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆమె చేసిన సాయాన్ని భర్త కౌశల్‌ ప్రశంసిస్తూ ట్వీట్‌ చేయగా..   ‘సుష్మాను హింసించండంటూ’ ఓ వ్యక్తి రీట్వీట్‌ చేశాడు. మరోవైపు సుష్మాకు పలువురు రాజకీయ నేతలు మద్ధతుగా నిలుస్తున్నారు.

ప్రజాభిప్రాయన్ని కోరిన సుష్మా

 

Trending News