Swachh Survekshan Awards: జాతీయ స్థాయిలో ఏపీ మరోసారి ఆకట్టుకుంది. వరుసగా రెండో ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో అదరగొట్టింది. ఈకార్యక్రమంలో భాగంగా తిరుపతి కార్పొరేషన్‌కు జాతీయ అవార్డు వచ్చింది. విశాఖ, విజయవాడ, పుంగనూరు, పులివెందులకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అవార్డులను అందుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ పాల్గొన్నారు. ఇటు తెలంగాణకు సైతం అవార్డులు దక్కినట్లు మొదట ప్రచారం జరిగింది. ఐతే ఇవాళ కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణకు ఎలాంటి అవార్డులు రాలేదని స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కిందని వార్త వచ్చింది. అంతా దీనిని నమ్మారు. ఐతే చివరి నిమిషంలో ఇదంతా తప్పుడు వార్త అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి వార్ ఉందో అర్థమవుతోంది. కక్ష సాధింపులో భాగంగానే ఇలా చేశారన్న విమర్శలు ఉన్నాయి.
మరోమారు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల వేదికగా మరో వివాదం తెరపైకి వచ్చింది. మిషన్ భగీరథకు అవార్డు వచ్చిందని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తీరా ఈకార్యక్రమం వచ్చేసరికి ఎలాంటి అవార్డు రాలేదని కేంద్ర జల్ జీవన శాఖ స్పష్టం చేసింది. మిషన్ భగీరథ పథకాన్ని కనీసం పరిగణలోకి తీసుకోలేదని తేల్చి చెప్పింది. తెలంగాణలో వంద శాతం నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం గుర్తించింది.
ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సమాచారం అందించింది. ఐతే జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం వంద శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు గ్రామ పంచాతీయాల ద్వారా ఎలాంటి తీర్మానాలు చేయలేదని తెలిపింది. గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో మాత్రమే తెలంగాణకు అవార్డు వచ్చినట్లు పేర్కొంది. దీంతో అవార్డుల విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు.
Also read:Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతల మధ్యే పోటీ..సోనియా మద్దతు ఎవరికీ..!
Also read:Kerala Court: మైనర్ రేప్ కేసులో నిందితుడికి 142 ఏళ్ల జైలు శిక్ష..కేరళ కోర్టు సంచలన తీర్పు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి