BBC Documentary: మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

BBC Documentary: ప్రధాని మోదీ బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. డాక్యుమెంటరీపై నిషేధం విధించేందుకు నో చెబుతూ..పిటీషన్‌ను కొట్టివేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2023, 03:57 PM IST
BBC Documentary: మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

దేశ ప్రధాని మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ లింకుల్ని, డాక్యుమెంటరీని బ్లాక్ చేసింది. మరోవైపు ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. 

జమ్ము కశ్మీర్ అల్లర్ల నేపధ్యంలో తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్ సినిమాకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ తోడ్పాటు అందిస్తే..గుజరాత్ అల్లర్ల నేపధ్యంలో తెరకెక్కిన బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందిన ఈ డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ లింకుల్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బ్లాక్ చేసింది. మరోవైపు  డాక్యుమెంటరీని బ్యాన్ చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

గుజరాత్ అల్లర్లతో పాటు ప్రధాని మోదీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ తప్పుదోవ పట్టిస్తోందని కేంద్రం బ్యాన్ చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడా కన్పించకుండా సెన్సార్ విధించింది. మరోవైపు హిందూ సేన అనే సంస్థ అయితే బీబీసీ ఛానెల్‌ బ్యాన్ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసి..పిటీషన్‌ను తిరస్కరించింది. అంతకుముందు సుప్రీంకోర్టు..కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీ ఒరిజినల్ రికార్డుల్ని సమర్పించాలని ఆదేశించింది. 3 వారాల్లో సమాధానమివ్వాలని తేల్చి చెప్పింది. 

బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం కోసం దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది పూర్తిగా అపోహలతో కూడిన పిటీషన్ అని అభిప్రాయపడింది. బీబీసీ డాక్యుమెంటరీ కేంద్ర ప్రభుత్వం, ఇండియాపై పక్షపాత ధోరణితో డాక్యుమెంటరీని రూపొందించారని..అంతర్జాతీయ ఇండియా, ప్రధాని మోదీ పేరు మార్మోగడంతో కుట్రపూరితంగా చిత్రీకరించారని పిటీషన్‌లో తెలిపారు. ఇది పూర్తిగా అపోహలతో కూడుకున్న పిటీషన్ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం విచారించింది. పిటీషన్‌దారులు పూర్తిగా తప్పుగా ఊహించారని..ఇది ఏ మాత్రం విచారణార్హం కాదని తేల్చారు. 

Also read: Hindenburg vs Adani: సర్వత్రా ఉత్కంఠ.. అదానీ వ్యవహారంపై నేడు సుప్రీంలో విచారణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News