Child Pornography News: చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఇటీవల మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ.. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, డౌన్‌లోడ్ చేయడం పోక్సో ప్రకారం నేరమేనని స్పష్టం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరంకాదని మద్రాస్ హైకోర్టు తీర్పునివ్వగా.. ఈ తీర్పును కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఛైల్డ్ పోర్నోగ్రఫీ షేర్ చేయకుండా డౌన్లోడ్ చేయడం, వీక్షించడం నేరం కాదన్న మద్రాస్ HC తీర్పును ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేయడం, చూడటం పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం నేరమని పేర్కొంది. చైల్డ్ పోర్నోగ్రఫీ పదంపై చట్టసవరణ చేయాలని పార్లమెంట్‌కు సూచించింది.
చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేయడం, చూడటం పోక్సో చట్టం ప్రకారం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. తీర్పు ఇవ్వడంలో హైకోర్టు ఘోర తప్పిదం చేసిందని పేర్కొంది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించవద్దని అన్ని కోర్టులను ఆదేశించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని 'పిల్లల లైంగిక వేధింపులు, దోపిడీ అంశాలు'గా పేర్కొనవచ్చని తెలిపింది.
తన ఫోన్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేశాడని 28 ఏళ్ల యువకుడిపై అభియోగాలు మోపిన కేసులో ఇటీవల మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వ్యక్తిపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్‌లను కోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం అనే తీవ్రమైన సమస్యతో పోరాడుతున్నారని.. అలాంటి వారిని శిక్షించే బదులు వారికి మంచి బుద్దులు నేర్పించేలా సమాజం పరిణితి చెందాలని మద్రాసు హైకోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీం కోర్టు.. ఆ వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్‌లను పునరుద్ధరించింది.
పిల్లలకు సంబంధించిన ఏదైనా అశ్లీలంగా ఉన్న ఫొటో, వీడియోలను డౌన్‌లోడ్ చేస్తే రూ.5 వేల వరకు జరిమానా విధించవచ్చు. మళ్లీ అదేతప్పు చేస్తే.. 10 వేల రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా పడుతుంది. వ్యాపారం కోసం పిల్లల అశ్లీల వీడియోలు సేవ్ చేసి పెట్టుకుంటే.. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. తదుపరి నేరారోపణలో ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష వరకు ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
SC on Child Pornography: చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పొరపాటున చూశారో..!