Supreme court: అర్నబ్ గోస్వామికు బెయిల్ మంజూరు, కోర్టులో ఏం జరిగిందో తెలుసా

రిపబ్లిక్ టీవి ఎడిటర్ అర్నబ్ గోస్వామికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో  50 వేల పూచీకత్తుపై సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Nov 11, 2020, 07:25 PM IST
  • అర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ తల్లిని హత్యచేసి..ఆత్మహత్య చేసుకున్నాడని కోర్టుకు చెప్పిన న్యాయవాది హరీష్ సాల్వే
  • హరీష్ సాల్వే చెప్పిందాట్లో నిజమెంత
Supreme court: అర్నబ్ గోస్వామికు బెయిల్ మంజూరు, కోర్టులో ఏం జరిగిందో తెలుసా

రిపబ్లిక్ టీవి ( Republic tv ) ఎడిటర్ అర్నబ్ గోస్వామి ( Arnab Goswamy )కి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో  50 వేల పూచీకత్తుపై సుప్రీంకోర్టు ( Supreme court ) బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ( Anwai naik suicide case ) ఆత్మహత్య కేసును తిరిగి ఓపెన్ చేయడంలో రాయ్‌గడ్ పోలీసులు  చట్టప్రకారం వ్యవహరించలేదని అర్నబ్ తరపు న్యాయవాది హరీష్ సాల్వా కోర్టుకు విన్నవించారు. గత ఏడేళ్లుగా అన్వయ్ సంస్థ అప్పుల్లో ఉందని..ముందు తన తల్లిని హత్యచేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడని హరీష్ సాల్వే కోర్టులో స్పష్టం చేశారు. 

రిపబ్లిక్ టీవికు వ్యతిరేకంగా గత కొద్దిరోజుల్నించి మహారాష్ట్ర పోలీసులు ( Maharashtra police ) దురుద్దేశ్యంతో వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని హరీష్ సాల్వా ఆరోపించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ( Maharashtra Home minister Anil Desmukh ) ఆదేశాల మేరకు..పోలీసులు అన్వయ్ నాయక్ కేసును మరోసారి ఓపెన్ చేశారని తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు అర్నబ్ గోస్వామిని నవంబర్ 4న అరెస్టు చేశారని..వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే విడుదల చేయాలని హరీష్ సాల్వే స్పష్టం చేశారు. అర్నబ్ గోస్వామికి వ్యతిరేకంగా ఉన్న కేసుల్ని సీబీఐకు అప్పగించాలని కోర్టును కోరారు. బెయిల్ ఇచ్చినంత మాత్రాన మిన్ను విరిగి పడదని తెలిపారు. Also read: Bihar Election result 2020: బిహార్ ఎన్నికల ఫలితాలు.. మళ్లీ ఎన్డీఏయేకే అధికారం..

ఈ కేసులో ఇప్పటికే లోయర్ కోర్టులో విచారణ జరుగుతున్నందున సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం తరపున కపిల్ సిబల్ వాదించారు. ఈ కేసులో లోయర్ కోర్టులో రేపు తీర్పు రావచ్చని..కేసులో మహారాష్ట్ర పోలీసులు పలు ఆధారాలు సేకరించిందని..కోర్టులో అతన్ని అనుమతించేందుకు అనుమతివ్వాలని కోరారు.  

ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరినైనా టార్గెట్ చేస్తే..అది చట్టానికి విరుద్ధమవుతుందని ఈ సందర్బంగా సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది.  రాజ్యాంగ ప్రకారం మనం ఒక న్యాయరక్షకులిగా వ్యక్తిగత స్వతంత్రతను రక్షించకపోతే..ఇంకెవరు చేస్తారని విచారణ సందర్భఁగా జస్టిస్ చంద్రచూడ్ ( Justice Chandrachood ) వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరినైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనుకుంటే...ప్రజల రక్షణ కోసం ఇతర కోర్టులున్నాయనే సంగతి గుర్తుంచుకోవాలని చెప్పారు. 

అర్నబ్ గోస్వామి ( Arnab Goswamy )తో పాటు మరో ఇద్దరిని ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, అతని తల్లి ఆత్మహత్య కేసులో రాయ్‌గఢ్ పోలీసులు నవంబర్ 4న  అరెస్టు చేశారు. తమకు చెల్లించాల్సిన 5.4 కోట్లను నిందితులు తిరిగి చెల్లించని కారణంగా ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నామనేది సూసైడ్ నోట్ సారాంశం.  ఈ కేసును తిరిగి ఓపెన్ చేసిన మహారాష్ట్ర పోలీసులు నిందితుల్ని అరెస్టు చేశారు. Also read: BEL Recruitment 2020: భారత్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 549 పోస్టులకు నోటిఫికేషన్

Trending News