7 రాష్ట్రాలకు జరిమానా విధించిన సుప్రీం కోర్టు

7 రాష్ట్రాలకు జరిమానా విధించిన సుప్రీం కోర్టు  

Last Updated : Dec 1, 2018, 07:38 PM IST
7 రాష్ట్రాలకు జరిమానా విధించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: ఒక్కో రాష్ట్రానికిగాను రూ.50,000 చొప్పున, మొత్తం ఏడు రాష్ట్రాలకు జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలలో ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో కేంద్రంతో సహకరించనుందుకుగాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ సుప్రీం కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా, అస్సాం, గోవాలకు ఈ జరిమానా విధిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసినట్టు ఏఎన్ఐ పేర్కొంది.

Trending News