Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన, తక్షణం నిలిపివేయాలంటూ ఆగ్రహం

Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాలు తగలబెట్టడం అంటే హత్యకు పాల్పడినట్టేనని ధర్మాసనం అభిప్రాయపడింది. తక్షణం ఈ ప్రక్రియను ఆపాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 7, 2023, 04:47 PM IST
Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన, తక్షణం నిలిపివేయాలంటూ ఆగ్రహం

Delhi Pollution: ఢిల్లీలో రోజురోజుకూ కాలుష్యం తీవ్రమౌతోంది. గాలి నాణ్యత అతకంతకూ పడిపోతుండటంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో రైతులు తగలబెట్టే పంట వ్యర్ధాల కారణంగా ఢిల్లీ కాలుష్యం బారిన పడుతోంది. ప్రతి యేటా శీతాకాలంలో ఈ సమస్య సాధారణమైపోయింది. 

దేశ రాజధాని ఢిల్లీ ప్రతి ఏటా శీతాకాలం వచ్చిందంటే చాలు కాలుష్యం బారిన పడుతుంటోంది. కాలుష్యం ఎంత దారుణంగా ఉంటుందంటే శ్వాస పీల్చడమే కష్టమౌతుంటుంది. చుట్టుపక్కల హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రైతులు లక్షలాది ఎకరాల్లో పంట వ్యర్ధాల్ని తగలబెడుతుంటారు. ఈ పొగ అంతా ఢిల్లీని కమ్మేస్తుంటుంది. ఎదురుగా ఏమున్నదో కూడా తెలియనంతగా ఉంటుంది. దీనికి తోడు వాహన కాలుష్యం ఉండనే ఉంటుంది. అందుకే ప్రతియేటా డిల్లీలో కాలుష్యం సమస్య సీజనల్ సమస్యగా వచ్చిపోతుంటుంది. ఈసారి తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై దాఖలైన పిటీషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 

పంట వ్యర్ధాల్ని తగలబెట్టడం అంటే హత్య చేయడంతో సమానమంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సమస్యను పరిష్కరించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందించుకోవడం మంచిది కాదని సూచించింది. పంట వ్యర్ధాల్ని తగలబెట్టడం వెంటనే ఆపేయాలని పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ రాష్ఠ్రాల్ని ఆదేశించింది. ఎలా ఆపుతారు, ఏం చేస్తారనేది మాకు సంబంధం లేదు, కానీ ఇది మీ పని, తక్షణం చేపట్టాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా బాధత్యాయుతంగా వ్యవహరించాలంది. ఘన వ్యర్ధాల్ని బహిరంగ ప్రదేశాల్లో కాల్చకుండా తగిన చర్చలు తీసుకోవాలని సూచించిది. సరి బేసి వాహనాల వినియోగం విధానం సరైన ఫలితాలని ఇవ్వకపోవచ్చని తెలిపింది.

డిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం అత్యవసర సమావేశం నిర్వహించి పంట వ్యర్ధాల్ని తగలబెట్టకుండా నింయత్రించడమే కాకుండా ప్రత్యామ్నాయం సూచించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం కాలుష్య నియంత్రణకు గ్రాప్ స్టేజ్ 4 ఆంక్షలు అమలు చేస్తోంది. అంటే సీఎన్జీ యేతర వాహనాలకు ప్రవేషం లేదు. మరోవైపు సరి , బేసి వాహనాలు వినియోగించేలా నిర్ణయం తీసుకుంది. 

Also read: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలపై మిషన్ చాణక్య సర్వే, అధికారం ఆ పార్టీకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News