SC Demonetisation Judgement: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Supreme Court Judgement on 2016 Demonetisation. పెద్ద నోట్ల రద్దు అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది. నోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 2, 2023, 12:30 PM IST
  • నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
  • పెద్ద నోట్ల రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు
  • 58 పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు
SC Demonetisation Judgement: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Supreme Court Demonetisation Verdict: పెద్ద నోట్ల రద్దు అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది. నోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. జస్టిస్‌ ఎన్‌ఎ నజీర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఆర్బీఐ తీసుకున్న పెద్ద నోట్ల రద్దును కొట్టివేయలేమంటూ పేర్కొంది. 2016 డీమానిటైజేషన్‌పై దాఖలైన 58 పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు.. నోట్ల రద్దు నిర్ణయం సరైదేనంటూ అభిప్రాయపడింది.

కేంద్ర ప్రభుత్వం 2016లో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ..  దాఖలైన 58 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను గత డిసెంబరు 7న అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలను ఆదేశించింది. జస్టిస్‌ ఎస్‌ఎ నజీర్‌ నేతృత్వంలోని 5 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇప్పటికే విచారణను ముగించి.. తీర్పును ఈరోజు రిజర్వు చేసింది. నేడు (2023 జనవరి 2) ఈ అంశంపై రెండు వేర్వేరు తీర్పులు వెలువడ్డాయి.

జస్టిస్ బీఆర్ గవాయ్ 2026 నోట్ల రద్దును సమర్థించగా.. జస్టిస్ నాగరత్న మాత్రం విభేదించారు. నలుగురు న్యాయమూర్తులు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించగా, ఒకరు మాత్రం విభేధించారు. దాంతో  4-1 మెజారిటీతో 2016 నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గావాయ్, ఎస్ అబ్దుల్ నజీర్, ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్, బీవీ నాగరత్న ఉన్నారు. ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వలో ఈ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అయింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితం ఆధారంగా 2026 నోట్ల రద్దు నిర్ణయాన్ని రద్దు చేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. పెద్దనోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని.. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని జస్టిస్‌ గవాయ్‌ తెలిపారు. నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం కేవలం గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా కాకుండా.. ప్లీనరీ చట్టం రూపంలో నిర్ణయం వెలువరించాల్సిందని జస్టిస్‌ నాగరత్న అభిపాయపడ్డారు. 

Also Read: Purse Vastu Tips: కొత్త ఏడాదిలో ఈ వస్తువులు పర్స్‌లో పెట్టుకుంటే.. ఏడాది పొడవునా డబ్బేడబ్బు!  

Also Read: New Year 2023 Vastu Tips: నూతన సంవత్సరంలో ఈ పరిహారాలు చేస్తే.. సంవత్సరం పొడవునా డబ్బే డబ్బు! వారానికోసారి స్నానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News