Supreme Court Collegium Issue: కొలీజియం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం, మరోసారి కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

Supreme Court Collegium Issue: సుప్రీంకోర్టు కొలీజియం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి రచ్చ రేగింది. కొలీజియం సిఫార్సుల విషయంలోనే మళ్లీ వివాదం రాజుకుంటోంది. కేంద్ర విధానాన్ని తప్పుబట్టింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 21, 2023, 11:09 AM IST
Supreme Court Collegium Issue: కొలీజియం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం, మరోసారి కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

Supreme Court Collegium Issue: సుప్రీంకోర్టు కొలీజియం విషయంలో చాలాకాలంగా కేంద్ర ప్రభుత్వానికి సరిపడటం లేదు. కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు మధ్య వాదోపవాదాలు జరిగాయి. కొలీజియంపై కేంద్రం వైఖరి సరికాదంటూ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో హితవు పలికింది. అయినా ఇంకా అదే అస్పష్టత కొనసాగుతోంది.

దేశంలో సర్వోన్నత న్యాయ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వానికి మద్య అభిప్రాయబేధాలు సమసిపోవడం లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో ఇరువురి మధ్య వివాదం చెలరేగుతూనే ఉంది. న్యాయమూర్తుల నియామకాన్ని చేపట్టే కొలీజియం సిఫారసుల ఆమోదం విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం..ఆ కొలీజియం సూచించిన అన్ని పేర్లను ఆమోదించకుండా పెండింగులో పెడుతోంది. కొలీజియం సిఫారసులపై కేంద్రం అవలంభిస్తున్న ఈ వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. నచ్చినవారికి ఎంపిక చేసి మిగిలినవారికి పక్కనబెట్టడం సరైంది కాదంటూ హితవు పలికింది. 

హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో కొలీజియం పంపించిన సిఫారసులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. కొలీజియం పంపించిన పేర్లలో కొన్ని ఆమోదించి కొన్నింటిని విషయంలో జాప్యం ప్రదర్శించడంతో సంబంధిత న్యాయమూర్తులు సీనియారిటీ కోల్పోతున్నారని అభిప్రాయపడింది. 

ఇప్పటికే వివిధ రాష్ట్రాల హైకోర్డు న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిపారసు చేసిన 8 మంది పేర్లు ఇంకా పెండింగులో ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఇప్పటికే కొన్ని పేర్లను రెండు మూడు సార్లు ప్రతిపాదించాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు తెలిపింది.హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానం సరైంది కాదని, ఇది మంచి పరిణాం కాదని సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తెలిపారు. ఇది మంచిది కాదని గతంలోనూ చెప్పామని, ఈ తరహా చర్యల ద్వారా ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇవ్వదల్చుకుందని ప్రశ్నించారు.

Also read: IT Raids: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ ఇళ్లు, ఆస్థులపై ఐటీ దాడులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News