Google investments: న్యూఢిల్లీ: సుందర్ పిచాయ్ ( Sundar Pichai ) నేతృత్వంలోని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ( Google ) వచ్చే ఐదారేళ్లల్లో భారతదేశంలో రూ.75వేల కోట్ల ( 10 బిలియన్ డాలర్లు ) పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ పెట్టుబడులను డిజిటైజేషన్ ఫండ్ పేరుతో పెట్టనున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్, పార్ట్‌నర్‌షిప్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, ఎకోసిస్టమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూపంలో పెడతామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. డిజిటైజేషన్ కోసం ప్రత్యేకంగా నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టినట్లు పిచాయ్ పేర్కొన్నారు. ప్రతీ భారతీయుడు తమ మాతృభాషలో సమాచారాన్ని పొందగలగడం, భారతదేశానికి అవసరమైన కొత్త సేవలు, ఉత్పత్తులు, వస్తువులను ప్రారంభించడం, డిజిటల్ చెల్లింపుల దిశగా చిన్న, పెద్ద వ్యాపారులను ప్రోత్సహించడం, ఆధునాతన టెక్నాలజీతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపైనే ప్రధాన దృష్టిపెట్టినట్లు పిచాయ్ వెల్లడించారు. Also read: Sachin Pilot: ఎవరీ సచిన్ పైలట్? ఎందుకీ వివాదం?
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో భారత్ మంచి పురోగతి సాధించిందని, డిజిటల్ ఇండియా ( Digital India ) కోసం ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) విజన్ అద్భుతమని సుందర్ పిచాయ్ ప్రశంసించారు. ప్రధాని మోదీతో జరిగిన గూగుల్ ఫర్ ఇండియా వర్చువల్ ఈవెంట్ అనంతరం సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Today at #GoogleForIndia we announced a new $10B digitization fund to help accelerate India’s digital economy. We’re proud to support PM @narendramodi’s vision for Digital India - many thanks to Minister @rsprasad & Minister @DrRPNishank for joining us. https://t.co/H0EUFYSD1q
— Sundar Pichai (@sundarpichai) July 13, 2020
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు మధ్య పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. కరోనావైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సమస్యలు, ఆర్థిక మందగమనం, పెట్టుబడులు, కోవిడ్ తరువాత మారిన పరిస్థితులు, టెక్నాలజీ లాంటి విషయాలను పీఎం మోదీ, సుందర్ పిచాయ్ చర్చించినట్లు సమాచారం. సుందర్ పిచాయ్‌తో భేటి అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేసి చర్చలు ఫలవంతంగా జరిగాయని తెలిపారు. Also read: Supreme court: ఆ గది తాళాలు వారివే