కేరళలో వరదలు విళయతాండవం చేసినట్టే కర్ణాటకలోని కొడగు ప్రాంతంలోనూ వరదలు ప్రళయం సృష్టించాయి. ఈ వరదల్లో కొడగు వాసులు సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. తినడానికి తిండి లేక అల్లాడుతున్న కొడగు వరద బాధితులకు అండగా నిలిచేందుకు నడుం బిగించిన ప్రముఖ సంఘ సేవకురాలు, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి తానే స్వయంగా ఆహారపదార్థాలు, వంట సామాగ్రి సిబ్బందికి అందిస్తూ వాళ్లు ప్యాకింగ్ చేయడానికి సహాయపడుతున్న దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
Amma 🙏🙏 #Sudha Murthy @infosys Support to #KeralaFlood #Coorgfloods pic.twitter.com/1036D389DT
— Sadananda Gowda (@DVSBJP) August 21, 2018
కొడగులో ఇబ్బందులు పడుతున్న వరద బాధితులకు తానే స్వయంగా రంగంలోకి దిగి సేవ చేస్తోన్న సుధామూర్తి ఔదార్యాన్ని చూసి కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు