ప్రజా సమస్యల పరిష్కారానికి ముందడగు ; సుభాష్ చంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విప్లవాత్మక  'దేశ్ కా సచ్ '  వెబ్ సైట్ లాంచ్

మన చుట్టూ అనేక సమస్యలు.. వాటిని పరిస్కరించే నాధుడు కరువయ్యాడని దిగులు చెందుతున్నారా.. ఇక ఇలాంటి సమస్య మీకు ఉండబోదు... మీ సమస్య ఏదైనా..ఎలాంటిదైనా సరే ఈ సరికొత్త వెబ్ సైట్ లో పిటిషన్ రూపంలో పంచుకోండి చాలు.. మీ సమస్యకు అతి తక్కువ వ్యవధిలోనే పరిష్కారం దొరుకుతుంది.. నమ్మలేకపోతున్నారా ? అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.

Last Updated : Oct 9, 2018, 10:04 AM IST
ప్రజా సమస్యల పరిష్కారానికి ముందడగు ; సుభాష్ చంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విప్లవాత్మక  'దేశ్ కా సచ్ '  వెబ్ సైట్ లాంచ్

మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని సుభాష్ చంద్ర ఫౌండేషన్ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చట్టింది. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఓ సరికొత్త  'దేశ్ కా సచ్ ' (www.deshkasach.in) పేరుతో విప్లవాత్మక వెబ్ సైట్ ( పిటిషన్ ప్లాట్ ఫాం) ను ప్రారంభించింది.  ఈ వెబ్ సైట్ వేదిక ద్వారా సమాజంలో సానుకూల మార్పును కోరుకునే పౌరులు ఒక పిటిషన్ సమర్పించవచ్చు లేదా ఇతరుల పిటిషన్లను సమర్ధించవచ్చు. వెబ్ సైట్ ప్లాట్ ఫాంపై పంచుకున్న ఏదైన పిటిషన్ కు కనీసం 10 వేల మంది మద్దతు లభిస్తే గనుక.. ఆ సమస్య పరిష్కారం విషయంలో ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ సుభాష్ చంద్ర గారు స్వయంగా చొరవ చూపుతారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి అతి తక్కువ వ్యవధిలోనే సమస్యకు పరిష్కారం చూపుతారు.

ముఖ్యాంశాలు :

* గాంధీ జయంతిని పురస్కరించుకొని సుభాష్ చంద్ర ఫౌండేషన్ సరికొత్త ఆలోచనకు శ్రీకారం
*  ప్రజా సమస్యల పరిష్కారానికి మొట్టమొదటి సారిగా 'దేష్ కా సచ్ ' అనే వెబ్ సైట్ లాంచ్ 
*  దేశ ప్రజల అభ్యన్నతి మరియు సమాజాన్ని శక్తి వంతం చేయడమే 'దేష్ కా సచ్ ' లక్ష్యం
*  మన చుట్టూ ఉన్న సమస్యలపై పిటిషన్ రూపంలో వెబ్ సైట్ లో పంచుకోవచ్చు
*  ప్రజా సమస్యలపై ఇతరుల పిటిషన్లను సమర్ధించే అవకాశం
*  పిటిషన్ కు పది వేల మంది మద్దతు లభించాల్సి ఉంది
*  జనాల మద్దతు ఉన్న పిటిషన్ విషయంలో స్వయంగా చొరవ తీసుకోనున్న 
ఫౌండేషన్ ఛైర్మన్ సుభాష్ చంద్ర 
*  అతి తక్కువ సమసయంలోనే మీ సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్

ఇంకేందుకు ఆలస్యం ఈ విప్లవంలో మీరూ భాగస్వాములు కండి.. 'Desh Ka Sach' వేదిక ద్వారా ప్రజా సమస్యలను పిటిషన్ రూపంలో పంచుకోండి...

సుభాష్ చంద్ర సందేశం...

నిత్యం జనహితం కోసం పాటుపడే సుభాష్ చంద్ర ఫౌండేషన్ ఛైర్మన్  శ్రీ సుభాష్ చంద్ర గారు వెబ్ సైట్ లాంచ్ సందర్భంగా దేశ పౌరులకు తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. వెబ్ సైట్ లాంచ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మొట్టమొదటి సారిగా డిజిటల్ విధానంలో 'దేశ్ కా సచ్ ' వెబ్ సైట్ ( పిటిషన్ ప్లాట్ ఫాం) ను అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశ ప్రజలకు శక్తివంతం చేయడానికి మరియు సంక్షేమాన్ని ఉద్దేశించి ఈ వెబ్ సైట్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పౌరులు దీన్ని వేదిగా ఉపయోగించి తమ సామాజిక అవసరాలను పిటిషన్ రూపంలో 'Desh Ka Sach' వెబ్ సైట్ లో పంచుకోవాలని  సూచించారు. పౌరుల ఆమెదం పొందిన సమస్య పరిష్కారానికి  స్వయంగా తానే చొరవ తీసుకుంటానని సుభాష్ చంద్ర  వెల్లడించారు. దేశంలో సరికొత్త  మార్పుకు 'Desh Ka Sach'  వెబ్ సైట్ వేదికగా నిలుస్తుందని ఈ సందర్భంగా సుభాష్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు

 

 

Trending News