SpiceJet flight : స్పైస్ జెట్ విమానంలో పొగలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. తప్పిన ప్రమాదం...

Spicejet Flight Emergency Landing: ఢిల్లీ-జబల్‌పూర్ స్పైస్ జెట్ విమానంలో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్స్ వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2022, 11:28 AM IST
  • ఢిల్లీ-జబల్‌పూర్ స్పైస్ జెట్ విమానంలో పొగలు
  • ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్స్
  • విమానానికి తప్పిన ప్రమాదం
SpiceJet flight : స్పైస్ జెట్ విమానంలో పొగలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. తప్పిన ప్రమాదం...

Spicejet Flight Emergency Landing: ఢిల్లీ-జబల్‌పూర్ స్పైస్ జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం (జూలై 2) ఉదయం 6.15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో పొగలు వచ్చాయి. కేబిన్‌లో పొగలు రావడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పైలట్స్ తిరిగి విమానాన్ని వెనక్కి మళ్లించి 7గం. సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఢిల్లీ-జబల్‌పూర్ స్పైస్ జెట్ ఎస్‌జీ-2862 ఆకాశంలో 5000 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో కేబిన్‌లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురయ్యామని.. పొగ నిండిపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టమైందని ప్రయాణికుడు ఒకరు వెల్లడించారు. దీనికి సంబంధించి స్పెస్ జెట్ ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. కేబిన్‌లో పొగ నిండటంతో ప్రయాణికులు బుక్‌లెట్స్‌తో గాలి విసురుకోవడం అందులో గమనించవచ్చు.

విమానంలో పొగలు రావడానికి గల కారణమేంటన్నది ఇప్పటికైతే వెల్లడికాలేదు. గడిచిన రెండు వారాల్లో ఇలాంటి ఘటన ఇది రెండోది. జూన్ 19న పాట్నా-ఢిల్లీ విమానంలో ఇలాగే పొగలు వచ్చాయి. విమానం ఖగౌల్-పుల్వారిషరీఫ్ మధ్య ఉండగా ఎడమవైపు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో విమానాన్ని పాట్నా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అంతకుముందు, మే 4న చెన్నై-దుర్గాపూర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి టెక్నికల్ కారణాలతో తిరిగి చెన్నై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ వరుస ఘటనలు స్పెస్ జెట్ ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

Also Read: LIGER: నగ్నంగా షాకిచ్చిన విజయ్ దేవరకొండ

Also Read: TRS BIKE RALLY: భాగ్యలక్ష్మి ఆలయానికి యోగీ.. చార్మీనార్ దగ్గర హై టెన్షన్.. టీఆర్ఎస్ ర్యాలీకి బ్రేక్

 

iframe allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen="" frameborder="0" height="350" src="https://vodakm.zeenews.com/vod/ZEE_HINDUSTAN_TELUGU/Kushbhu-visits-hyder..." width="100%">

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News