కరోనా వైరస్ . . ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమే గడగడలాడుతోంది. ఏ దేశంలో ఈ పేరు వినపడినా .. ఆ దేశవాసులు గజగజా వణికిపోతున్నారు. చైనాలో ఇప్పటికే వందలాది మందిని ఈ వైరస్ మృత్యు ఒడికి చేర్చింది. ఇప్పటికీ చైనాలో వేలాది మంది ఆస్పత్రిల్లోనే చికిత్స తీసుకుంటున్నారు. రోజుకు కనీసం 50 మంది అయినా కరోనా వైరస్ ప్రభావంతో మృతి చెందుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
భారత దేశంలోనూ కరోనా వైరస్ బారిన పడ్డ వారు ఉన్నారు. ఐతే పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ .. ఇప్పటి వరకు ఎవరూ మృతి చెందలేదు. కానీ కరోనా వైరస్ అంటే మాత్రం విపరీతమైన భయం పోలేదు. కరోనా వైరస్ పై కర్ణాటకలోనూ ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో అక్కడి ప్రజలు దేవుడి మీద భారం వేశారు. తుముకూరు జిల్లాలో ప్రత్యేకంగా కరోనా వైరస్ కోసం పూజలు, యజ్ఞాలు నిర్వహించారు. తుముకూరు జిల్లాలోని దుర్గా పరమేశ్వరి ఆలయం, శనీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా భూత భైరవి యజ్ఞాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ నుంచి కాపాడు తల్లీ అంటూ దుర్గా పరమేశ్వరీ మాతను వేడుకున్నారు.
నిప్పులపై నడక
భూత భైరవి యజ్ఞం తర్వాత పలువురు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. చాలా మంది భక్తులు నిప్పులు మీద నడిచారు. శనీశ్వరుని విగ్రహాన్ని మోసుకుని వెళ్తూ .. నిప్పులపై నడవడం విశేషం.