Sonu Sood: 'దేశ్ కే మెంటర్స్' బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్...సీఎం కేజ్రీవాల్ ప్రకటన

Sonu Sood:  విద్యార్థుల కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకురానున్న 'దేశ్ కే మెంటర్స్' ప్రోగ్రాంకు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ ను నియమించారు సీఎం కేజ్రీవాల్.    

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2021, 01:06 PM IST
  • విద్యార్థుల కోసం 'దేశ్ కే మెంటర్స్' ప్రోగ్రాం
  • బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ నియామకం
  • దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
Sonu Sood: 'దేశ్ కే మెంటర్స్' బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్...సీఎం కేజ్రీవాల్ ప్రకటన

Sonu Sood:  కరోనా కాలంలో ఎందరికో సాయం చేసి రియల్‌ హీరోగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు నటుడు సోనూసూద్‌(Sonu Sood). ఆయన ఇప్పుడు సరికొత్త బాధ్యతలు స్వీకరించారు. దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న ‘దేశ్‌ కే మెంటార్స్(desh ke mentors)’ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. 

 కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యార్థుల కోసం '‘దేశ్ కా మెంట‌ర్స్’' ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. అయితే ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా న‌టుడు సోనూసూద్(Sonu Sood) వ్యవహరించనున్నట్లు కేజ్రీవాల్‌(CM Arvind Kejriwal) వెల్లడించారు. ఈ సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘‘చాలా మంది విద్యార్థులకు భవిష్యత్తు గురించి సరైన అవగాహన ఉండదు. ఏం చేయాలి.. ఎక్కడికి వెళ్లాలి అనే అంశాల గురించి తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ‘దేశ్‌ కా మెంటర్స్‌’(desh ke mentors) కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. దీనికి సోనూసూద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది. 

Also Read:Tamilnadu: తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ మరో వినూత్న నిర్ణయం, ప్రభుత్వ కళాశాల్లో చదివితే

లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దేందుకు త‌నకు శిక్షకుడి (మెంట‌ర్‌) రూపంలో అవ‌కాశం ఇవ్వడం సంతోషంగా ఉంద‌ని సోనూసూద్(Sonu Sood) తెలిపారు. పిల్లలుకు దిశానిర్దేశం చేయ‌డం క‌న్నా మ‌రో గొప్ప సేవ‌లేద‌న్నారు. ఢిల్లీ ప్రభుత్వం(Delhi Government)తో క‌లిసి ఈ కార్యక్రమాన్ని విజ‌య‌వంతంగా ముందుకు తీసుకువెళ్తాను అని సోనూసూద్ స్పష్టం చేశారు.
అలాగే రాజకీయాల్లో రావటం గురించి సోనూసూద్(Sonu Sood) ను ప్రశ్నించగా..‘‘మీరు మంచిపనులు చేస్తున్నారు, రాజకీయాల్లో చేరండి’ అని నాకు చాలామంది చెప్పారు. అందుకు తగ్గట్టే అవకాశాలూ వస్తున్నాయి. మంచిపని చేయడం కోసం వాటిలో చేరాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వాటి గురించి ఆలోచించడం లేదు. కేజ్రీవాల్‌జీతో జరిగిన సమావేశంలో కూడా ఆ ప్రస్తావన రాలేదు’ అని అన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News