కాంగ్రెస్ మేనిఫెస్టో కవర్ పేజీ డిజైన్‌ పట్ల సోనియా అసంతృప్తి

కాంగ్రెస్ మేనిఫెస్టో కవర్ పేజీ డిజైన్‌ పట్ల సోనియా అసంతృప్తి

Last Updated : Apr 4, 2019, 12:52 PM IST
కాంగ్రెస్ మేనిఫెస్టో కవర్ పేజీ డిజైన్‌ పట్ల సోనియా అసంతృప్తి

న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రత్యర్థి పార్టీలు పెదవి విరిచిన సంగతి తెలిసిందే. అది షరా మామూలు కూడా. కానీ విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ఒక విధంగా ఆ పార్టీ మాజీ అధినేత్రి, యూపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీనే తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో కవర్ పేజీపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోటోను చిన్న సైజులో కాకుండా మేనిఫెస్టోలోని 9వ పేజీలో వున్న విధంగా ముద్రించి ఉంటే బాగుండేది అని ఆమె సూచించినట్టు సమాచారం. ముఖ్యంగా మేనిఫెస్టో కమిటీ ఎంచుకున్న చిక్కటి రంగు థీమ్ ఇమేజ్ ఆమెను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందట. 

విశ్వసనీయవర్గాలు వియాన్ న్యూస్ ఛానెల్‌కి తెలిపిన వివరాల ప్రకారం మేనిఫెస్టో కమిటి కన్వినర్, పార్టి రిసెర్చ్ విభాగం అధిపతి అయిన రాజివ్ గౌడ మేనిఫెస్టో విడుదలకు కొన్ని నిమిషాల ముందుగా సోనియా గాంధీని కలిసి మేనిఫెస్టో కాపీని చూపించగా అప్పుడే ఆమె తన అసంతృప్తిని వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. కవర్ పేజీపై లైట్ కలర్ థీమ్ ఉపయోగించి ఉంటే కవర్ పేజీ డిజైన్ ఇంకా బాగుండేదని సోనియా గాంధీ చెప్పినట్టు సమాచారం.

Trending News