అస్వస్థతకు గురైన సోనియాగాంధీ..!

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న సోనియా తన కుమార్తె ప్రియాంక వాద్రాతో కలిసి సిమ్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగృహాన్ని చూడడానికి వెళ్లారు. అక్కడే రాత్రి వరకూ ఉన్నారు.

Last Updated : Mar 23, 2018, 01:57 PM IST
అస్వస్థతకు గురైన సోనియాగాంధీ..!

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న సోనియా తన కుమార్తె ప్రియాంక వాద్రాతో కలిసి సిమ్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగృహాన్ని చూడడానికి వెళ్లారు. అక్కడే రాత్రి వరకూ ఉన్నారు. అయితే అర్థరాత్రి గడిచాక.. సోనియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

సోనియా అనారోగ్యానికి గురయ్యారని సమాచారం అందగానే.. ఆమె సిబ్బంది వెంటనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ మెడికల్ కళాశాలకు ఫోన్ చేశారు. అయితే ఆసుపత్రి నుండి వైద్యులు అంబులెన్సులో బయలుదేరేలోపే.. సోనియా మరో కారులో నగరం నుండి బయలుదేరారు. అయితే ఆమె కారు శివారు ప్రాంతాన్ని దాటేలోపలే.. అంబులెన్సు ఆమె కారును చేరింది. ఆమెను కారు నుండి అంబులెన్సులోకి షిఫ్ట్ చేసి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు మీడియాతో తెలిపారు. 

సోనియా గతంలో కూడా ఇలాగే పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. అక్టోబరు 2017లో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత ఆమె అమెరికాలోని ఓ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. 2016లో కూడా ఓసారి ఇలాగే జరిగింది. అప్పట్లో ఆమె వారణాసి వచ్చినప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారణాసి ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లోనే ఆమెకు అత్యవసర చికిత్స చేయించారు. ప్రస్తుతం సోనియా వయసు 70 సంవత్సరాలు పైమాటే.

Trending News