నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తున్నారా ?

మోదీ ప్రమాణస్వీకారోత్సవం కోసం రాష్ట్రపతి భవన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం వివిధ దేశాధినేతలు, వీవీఐపీలు, రాజకీయ, సినీ ప్రముఖుల మధ్య మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

Last Updated : May 29, 2019, 11:50 PM IST
నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తున్నారా ?

ఢిల్లీ: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి యూపీఏ ఛైర్‌ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. విశ్వసనీయవర్గాల వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరగనున్న మోదీ ప్రమాణస్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరవుతారని తెలుస్తోంది. 

ఇదిలావుంటే, మోదీ ప్రమాణస్వీకారోత్సవం కోసం రాష్ట్రపతి భవన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం వివిధ దేశాధినేతలు, వీవీఐపీలు, రాజకీయ, సినీ ప్రముఖుల మధ్య మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.

Trending News