అమేథి: ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అమేథి స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన స్మృతి ఇరానికి ప్రధాన అనుచరుడైన బీజేపీ క్రీయాశీల కార్యకర్త సురేంద్ర సింగ్ నిన్న రాత్రి హత్యకు గురవడం సంచలనం సృష్టించింది. అమేథి లోక్‌సభ నియోజకవర్గంలోని బరౌలియా గ్రామంలో తెల్లవారిజామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు సురేంద్ర సింగ్‌ని కాల్చిచంపారు. సురేంద్ర సింగ్ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Son of Surendra Singh, ex-village head of Barauli, Amethi who was shot dead y'day: My father was a close aide of Smriti Irani&used to campaign 24/7. After she became MP, Vijay Yatra was carried out. I think some Congress supporters didn't like it,we have suspicions on some people pic.twitter.com/JKeWj2RsMo
— ANI UP (@ANINewsUP) May 26, 2019
అమేథి నుంచి స్మృతి ఇరాని గెలిచిన అనంతరం నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించామని, అది మింగుడుపడని పలువురు తమపై కక్ష పెంచుకుని తన తండ్రిని హతమార్చారని సురేంద్ర సింగ్ అనుమానం వ్యక్తంచేశారు.