ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చోల్నార్ గ్రామంలో పోలీసుల వాహనం వెళ్తున్న సమయంలో రోడ్డుపై పాతిపెట్టిన ఐఈడీని మావోయిస్టులు పేల్చారు. ఈ పేలుడు ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో జవాన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జవాన్ల వాహనమే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. జవాన్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా మావోయిస్టులు ల్యాండ్‌మైన్‌ను పేల్చారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన మావోయిస్టులు జవాన్ల ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
ఐఈడీ బాంబు పేలుడుతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఘటనపై స్పందించిన యాంటీ-నక్సల్స్ డీఐజీ పి.సుందర్ రాయ్ మాట్లాడుతూ, దంతేవాడ ఘటనలో ఆరుగురు జవాన్లు చనిపోయారని, ఒకరు గాయపడ్డారని అన్నారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, పూర్తి స్థాయి దర్యాప్తు తరువాత అన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.
6 jawans dead, 1 injured according to preliminary investigation. Search operation is being held by security forces. Blast could be of high intensity, but the exact details will come after the investigation: Sunder Raj P, DIG Anti-Naxal Operation on Dantewada attack. #Chhattisgarh pic.twitter.com/bDDlJwxUkR
— ANI (@ANI) May 20, 2018