Aryan Khan Case: క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు..ఆర్యన్‌కు అందుకే ఊరట లభించిందా..?

Aryan Khan Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసు కీలక మలుపు తిరిగింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 03:32 PM IST
  • క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసు కీలక మలుపు
  • ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు
  • ఆర్యన్ ఖాన్‌కు ఊరట
Aryan Khan Case: క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు..ఆర్యన్‌కు అందుకే ఊరట లభించిందా..?

Aryan Khan Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూజ్ నౌక డ్రగ్స్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈకేసులో ప్రముఖ నటుడు షారుక్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో(NCB) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈమేరకు ఛార్జ్‌షీట్‌లో ఈ అంశాన్ని పేర్కొంది. ఆర్యన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని స్పష్టం చేసింది. అందుకే ఈ కేసులో అతడికి క్లీన్ చిట్ ఇస్తున్నట్లు సీనియర్ ఎన్‌సీబీ అధికారి అధికారికంగా వెల్లడించారు. క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో గతేడాది అక్టోబర్‌లో ఆర్యన్‌ఖాన్‌తోపాటు మరో 19 మందిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 

వీరిలో ఇద్దరు తప్ప మిగతా వారు బెయిల్‌పై విడుదలయ్యారు. ఆర్యన్, మోహక్ మినహా మిగతా వారందరి వద్ద డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఈకేసు సిట్‌కు బదిలీ అయ్యింది. దీనిపై సిట్ సుదీర్ఘంగా విచారించింది. 14 మందిపై కేసులు నమోదు చేసింది. ఐతే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆర్యన్ సహా మరో ఆరుగురిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.ఈక్రమంలోనే ముంబై కోర్టులో ఎన్‌సీబీ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 6 వేల పేజీల ఛార్జ్‌షీట్‌లో అన్ని అంశాలను వివరించారు. ఇందులో 14 మందిపై అభియోగాలు ఉన్నట్లు పేర్కొంది. 

ఆర్యన్‌ఖాన్‌తోపాటు మరో ఆరుగురి వద్ద డ్రగ్స్‌ దొరకలేదని ఈసందర్భంగా ఎన్‌సీబీ అధికారులు..కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈకేసులో ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్ చిట్ రావడంతో భారీ ఊరట లభించింది. దీనిపై సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిజం బయట పడుతుందన్నారు. ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ దొరకలేదని స్పష్టం చేశారు. అతడిపై కేసు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఇప్పటికైనా తన తప్పును ఎన్‌సీబీ తెలుసుకుందన్నారు.  ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు రోహత్గీ వాదనలు వినిపించారు. 

గతేడాది అక్టోబర్‌లో ముంబై తీరంలోని ఓ క్రూజ్ నౌకలో రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌ వాడకం జరగడం సంచలనంగా మారింది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అందులో షారుక్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌తోపాటు పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ఆర్యన్‌ ఖాన్‌కు కోర్టు.. జ్యూడిషియల్ కస్టడీ విధించింది. 

ఆర్యన్ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిగినా..బెయిల్ ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది. చివరకు ఆ అంశం బాంబే హైకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఆర్యన్ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఆర్యన్‌కు..క్లిన్ చిట్ రావడంతో షారుక్ కుటుంబం సంతోషంగా ఉంది.

Also read:High Cholesterol Food: అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ ఆహారాలను తినకూడదు..!!

Also read:TDP MAHANADU:మహానాడులో ప్రధాని మోడీపై చంద్రబాబు హాట్ కామెంట్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News