SEX on number plate: స్కూటీ నంబర్ ప్లేట్‌పై SEX.. ఆర్టీవోకి మహిళా కమిషన్ నోటీసులు

SEX on Delhi girl scooty number plate: ఢిల్లీ ఆర్టీవో అధికారులు ఓ యువతి స్కూటీకి కేటాయించిన నంబర్ సిరీస్‌లో S,E,X అనే అల్ఫాబెట్స్ వరుస క్రమంలో ఉండటం ఆమెకు కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. స్కూటీపై బయటికెళ్లినప్పుడల్లా ఆమె పోకిరీల నుంచి అసభ్యకరమైన కామెంట్స్ ఎదుర్కొంటోంది. దీనిపై ఆమె మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో ఆర్టీవో అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 03:20 PM IST
  • ఢిల్లీ యువతి స్కూటీ నంబర్ ప్లేట్‌పై S,E,X అల్ఫాబెట్ సిరీస్
  • ఆ సిరీస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతి
  • మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన యువతి
  • ఆర్టీవోకి మహిళా కమిషన్ నోటీసులు
SEX on number plate: స్కూటీ నంబర్ ప్లేట్‌పై SEX.. ఆర్టీవోకి మహిళా కమిషన్ నోటీసులు

SEX on Delhi girl scooty number plate: ఢిల్లీ ఆర్టీవో అధికారులు జారీ చేసిన 'SEX' అనే వెహికల్ నంబర్ సిరీస్ (Vehicle Number Series) వివాదాస్పదమవుతోంది. నంబర్ ప్లేట్‌పై ఈ సిరీస్ కారణంగా చాలామంది ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలకు పోకిరీల నుంచి అసభ్యకరమైన కామెంట్స్ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువతి ఢిల్లీ మహిళా కమిషన్‌కు (Delhi Commission for Women) దీనిపై ఫిర్యాదు చేసింది. స్పందించిన కమిషన్ ఆర్టీవో అధికారులకు నోటీసులు జారీ చేసింది.

ఆర్టీవో (Delhi RTO) కేటాయించిన నంబర్ సిరీస్‌లో S,E,X అనే అల్ఫాబెట్స్ వరుస క్రమంలో ఉండటంతో తాను తీవ్ర వేధింపులకు గురికావాల్సి వస్తోందని ఆ యువతి మహిళా కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. స్కూటీపై బయటకు వెళ్లినప్పుడల్లా ఆకతాయిలు తనపై జోక్స్, సెటైర్స్ వేస్తున్నారని వాపోయింది. ఈ కారణంగా అత్యవసర పనులకు కూడా స్కూటీపై వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నానని తెలిపింది. 

యువతి లేఖపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ఢిల్లీ రవాణా శాఖకు నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల్లోగా ఆ యువతి స్కూటీకి కేటాయించిన నంబర్ సిరీస్‌ను (SEX on scooty number plate) మార్చాలని ఆదేశించారు. ఇప్పటివరకూ ఈ సిరీస్ కింద ఎన్ని వాహనాలు రిజిస్టర్ అయ్యాయో... వాటి వివరాలు తమకు సమర్పించాలన్నారు. అలాగే ఈ నంబర్ సిరీస్‌ విషయంలో ఇప్పటివరకూ వ్యక్తమైన అభ్యంతరాలు, తీసుకున్న చర్యలపై నాలుగు రోజుల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. నంబర్ సిరీస్ కారణంగా ఆ యువతి వేధింపులకు గురికావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

ఢిల్లీకి చెందిన ఓ ఫ్యాషన్ డిజైన్ స్టూడెంట్‌కు SEX అనే నంబర్ సిరీస్ కేటాయించడం... దాని కారణంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కోవడం... ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై (SEX on scooty number plate) ఆమె తండ్రి ఆర్టీవో అధికారులను సంప్రదించినప్పటికీ నంబర్ మార్చడం కుదరదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ యువతి మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. ఎట్టకేలకు ఆ నంబర్ సిరీస్ మార్చాల్సిందిగా మహిళా కమిషన్ ఆదేశించడంతో ఆ యువతికి ఇబ్బందులు తప్పనున్నాయి.

Also Read: రొమాంటిక్ డేట్‌కు వెళ్లిన సారా టెండూల్కర్.. ఇంతకు ఆమె చేయి పట్టుకుంది ఎవరు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News