తబ్లీగీ జమాత్,రోహింగ్యాలకు లింకేంటి..?

'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తున్న వేళ . . జమ్మూ కాశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. తబ్లీగీ జమాత్, రోహింగ్యాలకు సంబంధాలు ఉన్నాయని తెలియడంతో ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

Last Updated : Apr 18, 2020, 04:15 PM IST
తబ్లీగీ జమాత్,రోహింగ్యాలకు  లింకేంటి..?

'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తున్న వేళ . . జమ్మూ కాశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. తబ్లీగీ జమాత్, రోహింగ్యాలకు సంబంధాలు ఉన్నాయని తెలియడంతో ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోహింగ్యాలు నివసిస్తున్న ప్రాంతాల్లో అత్యధికంగా భద్రతాపరమైన ఆంక్షలు విధించారు. దీంతో జమ్మూలోని భటిండి, సుంజువాన్ ప్రాంతాలు పూర్తిగా భద్రతా బలగాల పరిధిలోకి  వెళ్లిపోయాయి. లక్ష జనాభా ఉన్న ఈ పట్టణాలను హాట్ స్పాట్‌గా గుర్తించారు. అంతే కాకుండా పోలీసులు అనుమానం ఉన్న వ్యక్తులను పట్టుకునేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నారు.  

జమ్మూ కాశ్మీర్‌లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఐతే  కొంత మంది రోహింగ్యా ముస్లింలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీంతో భద్రతా బలగాలు 10 మంది రోహింగ్యా ముస్లింలను అరెస్టు చేశాయి. మసీదు నుంచి వారిని క్వారంటైన్‌కు తరలించారు.  వారిలో ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ నుంచి వచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరికొంత మంది ముస్లింలు భటిండిలోని కొన్ని ఇళ్లల్లో దాక్కున్నారు. ఐతే సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు మొత్తంగా 22 మందిని అరెస్టు చేశారు. వారిలో  9 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  
 
మరోవైపు రోహింగ్యా ముస్లింలు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు క్యాంపుల్లో నివసిస్తూ మత  ప్రార్థనల్లో పాల్గొంటున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి. తబ్లీగీ జమాత్‌తో కలిసి ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌లో మత ప్రార్థనల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు  ఇజ్‌తెమా పేరుతో హర్యానాలోని మేవట్‌లో మత ప్రార్థనలు చెసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్‌లో మత ప్రార్థనల్లో పాల్గొన్న తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోకుండా కొంత  మంది రోహింగ్యాలు జమ్మూ కాశ్మీర్ వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News