JNU News VC: మరోసారి తెలుగు వ్యక్తికి అవకాశం... జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ..

JNU VC: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (JNU) తొలి మహిళా వీసీగా ప్రాఫెసర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ నియమితులయ్యారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 04:08 PM IST
  • జేఎన్‌యూ వీసీగా మరోసారి తెలుగు వ్యక్తి
  • తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి
JNU News VC: మరోసారి తెలుగు వ్యక్తికి అవకాశం... జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ..

Jawaharlal Nehru University New VC: జేఎన్‌యూ తొలి మహిళా వీసీగా తెలుగు మూలాలున్న డాక్టర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ (Santishree Dhulipudi Pandit) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌గా (Jawaharlal Nehru University VC) మ‌హిళ ప్రొఫెస‌ర్‌ను నియ‌మించ‌డం ఇదే మెుదటిసారి. ఈ పదవిలో శాంతిశ్రీ ఐదేళ్లు ఉండనున్నారు. 

శాంతిశ్రీ రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జన్మించారు. చదువంతా తమిళనాడులోని మద్రాసులోనే సాగింది. ఈమె తండ్రి తెనాలికి చెందినవారు. ఆయన పేరు ధూళిపూడి ఆంజనేయులు. ఈయన రచయత, జర్నలిస్టు, రిటైర్డ్ సివిల్ సర్వెంటు అధికారి. శాంతి శ్రీ తల్లి ఆదిలక్ష్మి..రష్యాలోని లెనిన్‌గ్రాడ్‌ ఓరియంటల్‌ ఫ్యాకల్టీ డిపార్ట్‌మెంటులో తమిళ, తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. తెలుగు, తమిళం, హిందీ, సంస్కృతం, మరాఠీ, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు శాంతి శ్రీ.

శాంతి శ్రీ.. ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫులే యూనివర్శిటీలో రాజనీతిశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఈమె జేఎన్‌యూ నుంచే ఎంఫిల్‌, పీహెచ్‌డీ డిగ్రీలను పట్టాలను పొందారు. ఇటీవల జేఎన్‌యూ తాత్కాలిక వీసీగా పనిచేస్తున్న మన తెలుగు వ్యక్తి  ఎం జ‌గ‌దీశ్ కుమార్ పదవీకాలం ముగిసింది. తర్వాత ఆయనను యూజీసీ (UGC) ఛైర్మన్ నియమించింది కేంద్రప్రభుత్వం. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి తెలుగు వ్యక్తి వీసీగా వరుసగా రెండోసారి ఎంపికవ్వడం విశేషం.

Also Read: UGC New Chairman: యూజీసీ నూతన చైర్మన్‌గా తెలుగు వ్యక్తి నియామకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News