Sanjay Raut: అంతా కలిసి ఉద్దవ్ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచారు..సంజయ్ రౌత్ హాట్ కామెంట్స్..!

Sanjay Raut: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా క్లైమాక్స్‌కు చేరింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు. దీంతో తదుపరి కార్యాచరణపై బీజేపీ, అసమ్మతి ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 30, 2022, 02:33 PM IST
  • క్లైమాక్స్‌కు 'మహా' డ్రామా
  • రాజీనామా చేసిన ఉద్దవ్ ఠాక్రే
  • తాజాగా సంజయ్ రౌత్ హాట్ ట్వీట్
Sanjay Raut: అంతా కలిసి ఉద్దవ్ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచారు..సంజయ్ రౌత్ హాట్ కామెంట్స్..!

Sanjay Raut: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా క్లైమాక్స్‌కు చేరింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు. దీంతో తదుపరి కార్యాచరణపై బీజేపీ, అసమ్మతి ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. ప్రస్తుత పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన తిరుగుబాటు నేతలపై మండిపడ్డారు. శివసేన చీఫ్‌ ఉద్దవ్ ఠాక్రేకు అసమ్మతి నేతలు వెన్నుపోటు పొడిచారంటూ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.

ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసిన సమయంలో తామంతా ఉద్వేగానికి గురయ్యామని..ప్రతి ఒక్కరికీ ఆయనపై విశ్వాసం ఉందన్నారు. ఠాక్రేపై సోనియా గాంధీ, శరద్‌ పవార్ నమ్మకం ఉంచారని చెప్పారు. శివసేన అధికారం కోసం పుట్టలేదని..అధికారమే శివసేన కోసం పుట్టిందన్నారు సంజయ్ రౌత్. ఇక్కడితో తమ పోరాటాన్ని ఆపబోమని..మరోసారి సొంతంగా అధికారాన్ని చేపట్టేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు అందజేసింది. ముంబైలోని గోరెగావ్ పాత్రచాల్ భూకుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ సమన్లు జారీ చేసింది. రేపు(జూలై 1న) విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. దీనిపై సంజయ్ రౌత్ స్పందించారు. తాను రేపు ఈడీ కార్యాలయానికి వెళ్తానని..విచారణను ఎదురుకుంటానని స్పష్టం చేశారు.

Also read: GST Rate: దేశంలో సామాన్యులకు మరో షాక్‌..ఏ ఏ వస్తువులపై జీఎస్టీ పన్ను ఎంతో తెలుసా..?

Also read: Minister sabitha: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News