ISRO new chief: సోమ​నాథ్​కు ఇస్రో పగ్గాలు.. ముగిసిన శివన్​ శకం

ISRO new chief: ఇస్రో ఛైర్మన్​ శివన్ శకం ముగిసింది. ఆయన స్థానంలో నేటి నుంచి ఎస్. సోమ​నాథ్​ ఇస్రో ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 14, 2022, 10:33 PM IST
  • ఇస్రో ఛైర్మన్ ముగిసిన శివన్​ శకం
  • నేడు ఆ పదవిని చేపట్టిన సోమనాథ్​
  • మూడేళ్ల వరకు పదవి కాలం
ISRO new chief: సోమ​నాథ్​కు ఇస్రో పగ్గాలు.. ముగిసిన శివన్​ శకం

ISRO new chief: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్​ (ఇస్రో) నూతన ఛైర్మన్​గా నియమింతులైన.. ఎస్​ సోమనాథ్​​ నేడు బాధ్యతలు స్వీకరించారు. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ స్పేస్​ కార్యదర్శిగా, స్పేస్​ కమిషన్​ ఛైర్మన్​గా ఎస్​ సోమనాథ్​ శుక్రవారం బాధ్యతలు (ISRO new Chairman) చేపట్టినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

ఇక 2018 జనవరి నుంచి ఇస్రో ఛైర్మన్​గా సేవలందించిన కె.శివన్​ పదవీ (K Sivan ISRO) కాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఇస్రో ఘన వీడ్కోలు పలికింది.

ఇస్రో ఛైర్మన్​గా పదోన్నతి పొందక ముందు విక్రమ్​ సారాభాయ్ స్పేస్​ సెంటర్​ డైరక్టర్​గా ఎస్​ సోమనాథ్​ సేవలు అందించారు.

నేటి నుంచి మూడేళ్ల పాటు ఇస్రో కార్యదర్శి, ఛైర్మన్‌ స్థానాల్లో ఆయన కొనసాగనున్నారు. 1985లో వీఎస్‌ఎస్‌సీలో చేరిన సోమనాథ్‌.. ఉపగ్రహ వాహకనౌకల డిజైనింగ్‌లో కీలక పాత్ర పోషించారు. లాంచ్​ వెహికిల్ సిస్టమ్​ ఇంజనీరింగ్​లో సోమనాథ్​ నిపుణులు.

సోమనాథ్​ గురించి..

కేరళలో కొల్లంలోని టీకేఎం ఇంజనీరింగ్​ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు సోమనాథ్​. మెకానికల్ ఇంజనీరింగ్​లో ఆయన బీటెక్ పట్టా పొందారు. ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సైన్స్‌లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఆయనకు ఇందులో గోల్డ్​ మెడల్ రావడం గమనార్హం.

1985లో వీఎస్​ఎస్​వీలో చేసిన సమయంలో.. పీఎస్​ఎల్​వీ ఇంటిగ్రేషన్​ ప్రాథమిక దశలో టీమ్​ లీడర్​గా (About S Somanath) వ్యవహరించారు. ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఆయన గోల్డ్ మెడల్ పొందటం విశేషం.

Also read: Six Airbags for Cars: కార్లలో 6 ఎయిర్​ బ్యాగ్​లు తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం!

Also read: PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కుటుంబంలో ఎంతమందికి వర్తిస్తుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News