ప్రణబ్ ముఖర్జీపై దుష్ప్రచారాన్ని ఖండించిన కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్!

ప్రణబ్ ముఖర్జీపై దుష్ప్రచారాన్ని ఖండించిన కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్!

Last Updated : Jun 8, 2018, 08:28 PM IST
ప్రణబ్ ముఖర్జీపై దుష్ప్రచారాన్ని ఖండించిన కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్!

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం నాగపూర్‌లో జరిగిన రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రార్ధనలో ప్రణబ్ సైతం ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మాదిరిగానే సెల్యూట్ చేశారని పేర్కొంటూ పలు ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిపై వచ్చిన ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించిన కాంగ్రెస్ పార్టీ.. ఆర్ఎస్ఎస్ వేడుకలో పాల్గొన్న ప్రణబ్ అలా అక్కడ సెల్యూట్ చేయలేదని స్పష్టంచేస్తూ ఓ ట్వీట్ చేసింది. ఆర్ఎస్ఎస్‌కి అనుబంధంగా పనిచేసే కొంతమంది వ్యక్తులు ప్రణబ్ ఫోటోను మార్ఫింగ్ చేశారని, అంతకుమించి ఇందులో ఎటువంటి వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ ఈ ట్వీట్ ద్వారా అభిప్రాయపడింది. అంతేకాకుండా ప్రణబ్ ఆర్ఎస్ఎస్ వేడుకలో పాల్గొన్నప్పటి ఒరిజినల్, మార్ఫింగ్ చేసిన నకిలీ ఫోటోలను సైతం పక్కపక్కనే పెట్టి చూపిస్తూ జరిగిన విషయాన్ని అదే సోషల్ మీడియా ద్వారా ఖండించే ప్రయత్నం చేసింది.

 

ప్రణబ్ మార్ఫింగ్ ఫోటోల వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించినట్టుగానే ఆర్ఎస్ఎస్ సైతం దీనిపై ఓ ట్వీట్ చేసింది. మార్ఫింగ్ ఫోటోలతో చౌకబారు రాజకీయాలు చేయడం తగదంటూ ఆర్ఎస్ఎస్ డిప్యూటీ చీఫ్ డా.మన్మోహన్ వైద్య సైతం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆర్ఎస్ఎస్ అధికారిక ట్విటర్ పేజీలోనూ ఆ పత్రికా ప్రకటన చూడవచ్చు. 

 

Trending News