Wife murder, chopped body into 300 pieces : భార్యను చంపి 300 ముక్కలు.. మాజీ లెఫ్టినెంట్ కల్నల్‌కి జీవిత ఖైదు

కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసి, ఆమె శవాన్ని 300 ముక్కలు చేసిన నేరానికిగాను ఇండియన్ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ కల్నల్ సోమ్‌నాథ్ పరిడాకు భువనేశ్వర్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. క్లూస్ టీమ్ అందించిన శాస్త్రీయ ఆధారాలు, 24 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం ఖోర్జా జిల్లా కోర్టు ఈ తీర్పు వెల్లడించింది.

Last Updated : Feb 27, 2020, 09:44 AM IST
Wife murder, chopped body into 300 pieces : భార్యను చంపి 300 ముక్కలు.. మాజీ లెఫ్టినెంట్ కల్నల్‌కి జీవిత ఖైదు

భువనేశ్వర్ : కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసి, ఆమె శవాన్ని 300 ముక్కలు చేసిన నేరానికిగాను ఇండియన్ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ కల్నల్ సోమ్‌నాథ్ పరిడాకు భువనేశ్వర్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. క్లూస్ టీమ్ అందించిన శాస్త్రీయ ఆధారాలు, 24 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం ఖోర్జా జిల్లా కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 2013లో జరిగిన హత్యోదంతం ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన సోమ్‌నాథ్ పరిడ (78) ఇంట్లో చెలరేగిన ఓ చిన్న వివాదం కాస్తా భార్యాభర్తల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆ కోపంతో తన భార్య ఉషశ్రీ సమల్ (61)ను స్టీల్ టార్చ్ లైట్‌తో కొట్టి చంపిన సోమ్‌నాథ్.. అనంతరం భార్య శవాన్ని 300 ముక్కల కింద నరికాడు. శవాన్ని గుర్తించడానికి వీల్లేకుండా ముక్కలు చేసిన అనంతరం వాటిపై పలు రసాయనాలు చల్లి స్టీల్, గ్లాసు డబ్బాల్లో నింపిపెట్టాడు. ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి పొక్కకుండా అంతటితో జాగ్రత్తపడ్డానని సోమ్‌నాథ్ భావించాడు.

నేరం, నిజం.. ఈ రెండూ ఎంతో కాలం దాగుండవు కదా.. అలాగే ఓ రోజు అతడి అరాచకం కూడా వెలుగుచూసింది. అదెలా అంటే.. సోమ్‌నాథ్ - ఉషశ్రీలకు ఓ కూతురు ఉంది. ఆమె తన తల్లితో ఫోన్‌లో మాట్లాడటానికి ప్రయత్నించిన ప్రతీసారి ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో అనుమానం వచ్చిన ఉషశ్రీ కూతురు.. తన ఇంట్లో ఏదో జరిగిందని.. తన తల్లి తనకు అందుబాటులోకి రావడం లేదని భువనేశ్వర్‌లో ఉన్న తన మేనమాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. 

మేన కోడలు ఫిర్యాదుతో సోదరి ఉషశ్రీ ఇంటికి వెళ్లిన అతడికి.. అక్కడ సోమ్‌నాథ్ చేతిలో చేదు అనుభవమే ఎదురైంది. ఉషశ్రీ సోదరుడిని సోమ్‌నాథ్ ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో నేరుగా పోలీసు స్టేషన్‌కి వెళ్లిన అతడు.. తన సోదరి ఉషశ్రీ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఉషశ్రీ సోదరుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇంట్లో ఆమె కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సోమ్‌నాథ్ అరాచకం అప్పుడు బయటపడింది. ఇంట్లో ఉషశ్రీ కనిపించలేదు కానీ... ముక్కలుముక్కలైన ఆమె శరీర అవయవాలు ఇంట్లోని పలు చోట్ల దాచిపెట్టిన స్టీల్, గ్లాసు డబ్బాల్లో బయటపడ్డాయి. 

సోమ్‌నాథ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడిపై హత్య కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఝార్పద జైల్లో ఖైదీగా ఉన్న సోమ్‌నాథ్‌కి తాజాగా అతడి నేరం నిరూపణ అవడంతో కోర్దా జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News