వాట్సాప్: రిలయన్స్ జియో ఫోన్స్ వినియోగదారులకు గుడ్ న్యూస్

రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్స్ వినియోగదారులకు గుడ్ న్యూస్

Last Updated : Sep 12, 2018, 11:59 AM IST
వాట్సాప్: రిలయన్స్ జియో ఫోన్స్ వినియోగదారులకు గుడ్ న్యూస్

జియో ఫోన్, జియో ఫోన్ 2 వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇకపై జియో ఫోన్, జియో ఫోన్ 2 వినియోగదారులు సైతం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఉపయోగించుకోవచ్చు. జియో 4జీ ఫీచర్‌ ఫోన్లలోనూ వాట్సాప్‌ అందుబాటులోకి రావడమే అందుకు కారణం. అయితే, అందుకోసం సెప్టెంబర్ 20వ తేదీ వరకు వేచిచూడక తప్పదు. జియో ఫీచర్ ఫోన్లలో మొదటిసారిగా వాట్సాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, వాట్సాప్ సంస్థ ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. కేఏఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం కలిగిన జియో ఫీచర్ ఫోన్లలో ఈ వాట్సాప్ సౌకర్యం అందుబాటులోకి రానున్నట్టు ఈ ప్రకటన స్పష్టంచేసింది. 

జియో ఫోన్లపై వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చిన వెంటనే జియో ఫోన్ వినియోగదారులు జియో స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలిపారు. 

Trending News