కొజికోడ్: కేరళలో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి సంబంధించి విమానంలో ప్రయాణించిన ప్రయాణికుల తాజా పరిస్థితి గురించి ఆరా తీసేందుకు కొజికోడ్ జిల్లా కలెక్టర్ హెల్ప్ లైన్ నెంబర్ ( Help line number ) ప్రకటించారు. ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణించిన ప్రయాణికుల పరిస్థితి గురించి తెలుసుకునేందుకు వారి బంధువులు, కుటుంబసభ్యులు 0495 - 2376901 నెంబర్‌కి ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. Also read : AI Flight accident: కేరళలో విమాన ప్రమాదం.. రెండు ముక్కలైన విమానం
Relatives of passengers onboard Air India Express Flight (IX 1344) that crashed at Karipur International Airport, can contact the following Helpline Number for enquiries - 0495 - 2376901: Kozhikode Collector. #Kerala https://t.co/8pz0Z00FYu
— ANI (@ANI) August 7, 2020
దుబాయ్ నుంచి కేరళలోని కొజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ( AI flight ) క్యారిపూర్ ఎయిర్ పోర్టు రన్‌వేపై ప్రమాదానికు గురైన సంగతి తెలిసిందే. రాత్రి 7:45 నిమిషాలకు విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోయినట్టు మలప్పురం జిల్లా ఎస్పీ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలిపారు. మరో 123 మంది గాయపడ్డారని.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని మలప్పురం ఎస్పీ వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.
Air India Express Flight No IX 1344 from Dubai to Calicut skidded off the runway. We will keep you updated as and when we receive further updates. Our helplines - 056 546 3903, 0543090572, 0543090572, 0543090575: Consulate General of India, Dubai. pic.twitter.com/stXjtsHMKH
— ANI (@ANI) August 7, 2020