Vaccination of children: పిల్లల టీకాకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం- స్లాట్ ఎలా బుక్​ చేసుకోవాలంటే..

Vaccination of children: దేశంలో పిల్లల టీకాకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు సోమవారం నుంచి టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 11:08 AM IST
  • పిల్లల టీకాకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ
  • కొవిన్​ ద్వారా రిజిస్ట్రేషన్​కు అవకాశం
  • సోమవారం నుంచే టీకా కార్యక్రమం
  • ప్రస్తుతం కొవాగ్జిన్​కు మాత్రమే అనుమతి
Vaccination of children: పిల్లల టీకాకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం- స్లాట్ ఎలా బుక్​ చేసుకోవాలంటే..

Vaccination of children: 15 ఏళ్ల నంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం (vaccine for kids) చేసింది. ఇందులో భాగంగా నేటి నుంచి (2022 జనవరి 1) కొవిన్​ యాప్​, వెబ్​సైట్లలో పిల్లల టీకా కోసం రిజిస్ట్రేషన్​ ప్రక్రియ (Children vaccine registration) ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్​ చేసుకున్న అర్హులకు సోమవారం నుంచి టీకా ఇవ్వనున్నారు ఆరోగ్య సిబ్బంది. ప్రస్తుతం కొవాగ్జిన్​కు మాత్రమే పిల్లలకు ఇచ్చేందుకు అనుమతి ఉంది.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..

  • పెద్దల వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్​ చేసినట్లుగానే పిల్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది. 
  • ముందుగా కొవిడ్ యాప్​ లేదా పోర్టల్​లోకి వెళ్లి ఫోన్ నంబర్ ఎంటర్​ చేయాలి (తల్లి దండ్రుల ఫోన్ నంబర్లను ఇవ్వొచ్చు).
  • ఒకే నంబర్​పై నాలుగు రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంది. అంటే.. తల్లి దండ్రులు ఇద్దరూ ఒకే ఫోన్ నంబర్​ను వినియోగించి.. టీకా తీసుకున్నా మరో ఇద్దరికి అదే ఫోన్​ నంబర్ వినియోగించే వీలుంది.
  • ఓటీపీ ద్వారా ఫోన్ నంబర్​ను ధృవీకరించిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
  • రిజిస్ట్రేషన్​ పేజీలో టీకా తీసుకునే వారి పేరు, పుట్టిన తేదీ, జెండర్​ వంటి వివరాలు నమోదు చేయాలి. ఆధార్​ ద్వారా రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత టీకా షెడ్యూల్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే టీకా ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నారో (జనవరి 3 నుంచి ఆ తర్వాత) ఆ తేదీని ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్​కు వెళ్లి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.

గత నెలలోనే పిల్లల టీకాకు అనుమతి..

గత నెల 25వ తేదీన ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇందులో జనవరి 3 నుంచి పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పాఠశాలలు సాధార స్థితిక వస్తుండటంతో.. పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన తొలగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

పెద్దలకు (అర్హులైన వారికి మాత్రమే) మూడో డోసు టీకాపై కూడా ప్రకటన చేశారు. దేశంలో దీనిని బూస్టర్ డోసుగా కాకుండా.. ముందు జాగ్రత్త టీకాగా పిలువనున్నట్లు తెలిపారు ప్రధాని మోదీ.

Also read: Corona cases in India: ఒక్క రోజులో 22,700 కరోనా కేసులు, 406 మరణాలు

Also read: Vaishno Devi Stampede : కొత్త సంవత్సరం వేళ విషాదం.. వైష్ణో‌దేవి ఆలయంలో తొక్కిసలాట, 12 మంది భక్తులు మృతి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News