తమిళనాడు సముద్రపు నీటిని రీసైక్లింగ్ చేసి త్రాగునీటికి, నీటిపారుదల కొరకు ఉపయోగించుకుంటోందని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. హోషంగాబాద్, మధ్యప్రదేశ్: తమిళనాడు సముద్రపు నీటిని రీసైక్లింగ్ చేసి త్రాగునీటికి, నీటిపారుదల కొరకు ఉపయోగించుకుంటోందని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బంద్రాభన్లో ఐదవ నదీ మహోత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చి లీటరు ఐదు పైసలకే అందించనున్నట్లు వెల్లడించారు.
సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే ప్రక్రియకు తమిళనాడు రాష్ట్రంలోని టుటికోరన్‌లో శ్రీకారం చుట్టామని అన్నారు. దీని ద్వారా నీటి సంక్షోభాన్ని పరిష్కరించవచ్చని అన్నారు. మిగులు నీటిని రైతులకు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నదుల పరిరక్షణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలను ఈ సందర్భంగా గడ్కరీ ప్రశంసించారు. కొన్ని రాష్ట్రాలు నదీ జలాల పంపిణీ కోసం పోరాడుతున్నాయని కాని మన నదుల్లోని నీరు పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు వెళుతుంటే ఎవరూ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని మంత్రి వ్యాఖ్యానించారు.