Pm modi 3.0 Oath taking ceremony in delhi: దేశంలో 18 వ లోక్ సభకు ప్రజలు వినూత్నంగా రిజల్ట్ ఇచ్చారు. అప్ కీ బార్ చార్ సో పార్ అన్న మోదీకి.. కనీసం మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునేంత స్థానాలు కూడా రాలేదు.ఈ నేపథ్యంలో మోదీ తన మిత్ర పక్ష పార్టీల సహాయంలో కేంద్రంలో ప్రభుత్వం ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. మోదీ నిన్న ఢిల్లీలో (ఆదివారం) రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి అతిథులు తరలివచ్చారు. దాదాపుగా పదివేల మంది మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరైనట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీతో పాటు, 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేశారు.
Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..
వీరిలో 30 మంది కేబినెట్, ఐదుగురు సహాయ ( స్వతంత్ర), మరో 36 మంది సహాయ మంత్రులుగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈసారి మోదీ కేంద్ర మంత్రి వర్గంలో గతంలో మంత్రులుగా చేసిన వారికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. స్మృతీ ఇరానీ, నారాయణ్ రాణే, అనురాగ్ ఠాకుర్ల తో పాటు మరికొందరికి ఈసారి బిగ్ ట్విస్ట్ ఎదురైందని చెప్పుకొవచ్చు. మరోవైపు మోదీ కొందరు ఎన్నికలలో ఓటమి చెందిన కూడా వారికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఎన్నికలలో ఏ పార్టీకి చెందిన నేతలైన ఓడిపోతే వారిని ఎవరు పట్టించుకోరు. కానీ మోదీ కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో మోదీ ఇద్దరు కీలక నేతలు ఎంపీ ఎన్నికలలో ఓడిన కూడా కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించారు.వారు పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తుగా మోదీ 3.0 కేబినేట్ లో ఈ అవకాశం ఇచ్చినట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఎల్. మురుగన్, పంజాబ్ కు చెందిన బీజేపీ నేత రవ్నీత్ సింగ్ బిట్టూ ఆదివారం సాయంత్రం కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఎల్.మురుగన్
బీజేపీ తమిళనాడు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్. మురుగన్ నీలగిరి నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికలబరిలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో.. డీఎంకే నుంచి పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, 2021లోనే రాజ్యసభకు ఎంపికైన మురుగన్.. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. తమిళనాడులో బీజేపీ గెలవకపోయిన ఓట్లశాతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తమిళనాడుకు పెద్దపీట వేయాలని బీజేపీ పెద్దలు భావించినట్లు సమాచారం. మొదట్లో అన్నమలైకి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగినప్పటికి.. అనూహ్యంగా.. ఎల్ మురుగన్ కు బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో మురుగన్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని నాయకులు చెబుతుంటారు.
రవనీత్ సింగ్ బిట్టూ
రవనీత్ సింగ్ బిట్టూ తొలుత కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన మూడు సార్ల లోక్ సభకు ప్రాతిధ్యం వహించారు.ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు 2024 లో అనూహ్యంగా బీజేపీలో చేరారు. ఆయన పంజాబ్ లోని లూథియానా నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అదే విధంగా రాజ్యసభలోను ఎంపీ కాదు. కానీ ఆయనకు మోదీ అవకాశం కల్పించారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన రవనీత్ ను.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్.. అమరీందర్ సింగ్ రాజా ఓడించారు.
Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
ఈయన ఓడినా కూడా బీజేపీ ఓట్ల షేర్ నుపెంచడంలో ప్రభావవంతగా పనిచేశాడు. అంతేకాకుండా.. ఆ రాష్ట్ర మాజీ సీఎం బియాంత్ సింగ్ మనవడు. పంజాబ్ లో వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించి, సీఎంగా ఉన్న సమయంలోనే హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో.. రవ్నీత్ సింగ్ కు కేంద్ర మంత్రి వర్గంలో బీజేపీ మంత్రిగా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter