Rakesh Jhunjhunwala Death: ఇండియన్ వారెన్ బఫెట్ 'రాకేష్ జున్‌జున్‌వాలా' కన్నుమూత..

Rakesh Jhunjhunwala Passes Away: స్టాక్ మార్కెట్‌లో తిరుగులేని ఇన్వెస్టర్, ఇండియన్ వారెన్ బఫెట్‌గా పేరుగాంచిన రాకేష్ జున్‌జున్‌వాలా (62) కన్నుమూశారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 14, 2022, 11:02 AM IST
  • ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా కన్నుమూత
  • కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జున్‌జున్‌వాలా
  • జున్‌జున్‌వాలాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు
Rakesh Jhunjhunwala Death: ఇండియన్ వారెన్ బఫెట్ 'రాకేష్ జున్‌జున్‌వాలా' కన్నుమూత..

Rakesh Jhunjhunwala Passes Away: స్టాక్ మార్కెట్‌లో తిరుగులేని ఇన్వెస్టర్, ఇండియన్ వారెన్ బఫెట్‌గా పేరుగాంచిన రాకేష్ జున్‌జున్‌వాలా (62) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 6.45 గంటల సమయంలో జున్‌జున్ వాలాను ముంబైలోని క్యాండీ బ్రీచ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జున్‌జున్ వాలా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాకేష్ జున్‌జున్‌వాలా కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాకేష్ జున్‌జున్‌వాలాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

జూలై 5, 1960న పుట్టిన రాకేష్ జున్‌జున్‌వాలా ముంబైలో పెరిగారు. తండ్రి ముంబైలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కావడంతో అక్కడే నివాసముండేవారు. తన తండ్రి.. స్నేహితులతో మాట్లాడేటప్పుడు తరచూ స్టాక్ మార్కెట్ గురించి చర్చించేవాడు. ఆ మాటలే రాకేష్ జున్‌జున్‌వాలాలో స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తిని పెంచాయి. అలా 1985లో కాలేజీ రోజుల్లో కేవలం 100 డాలర్లతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా రాకేష్ జున్‌జున్‌వాలా ప్రయాణం మొదలైంది.  క్రమంగా స్టాక్ మార్కెట్‌పై పూర్తి పట్టు సంపాదించిన జున్‌జున్‌వాలా తిరుగులేని ఇన్వెస్టర్‌గా మారిపోయారు. ఈ ఏడాది జూలై నాటికి రాకేష్ జున్‌జున్‌వాలా నికర ఆస్తుల విలువ దాదాపు 5.5 బిలియన్ డాలర్లు.

సొంత ట్రేడింగ్ కంపెనీ :

రాకేష్ జున్‌జున్‌వాలాకు సొంత ట్రేడింగ్ కంపెనీ ఉంది. RARE ఎంటర్‌ప్రైజెస్ పేరిట దాని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తన పేరులోని మొదటి అక్షరాలు, తన భార్య రేఖ పేరులోని మొదటి అక్షరాలను జోడించి ఈ పేరును పెట్టారు. టాటా టైటాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ జున్‌జున్‌వాలాకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టాయి. అలాగే, క్రిసిల్, అరబిందో ఫార్మా, ప్రజ్ ఇండస్ట్రీస్, ఎన్‌సీసీ, ఏపీటెక్ లిమిటెడ్, ఎంసీఎక్స్, ఫోర్టీస్ హెల్త్ కేర్, లూపిన్, విప్ ఇండస్ట్రీస్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ర్యాలీస్ ఇండియా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ తదితర షేర్స్ రాకేష్ జున్‌జున్‌వాలాకు లాభాల పంట పండించాయి.

Also Read: Naga Chaitanya: ప్రేయసితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేసిన నాగచైతన్య !

Also Read: Happy Independence Day: రేపే భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఇండిపెండెన్స్ డే కొటేషన్స్, విషెస్, స్టేటస్‌లు మీకోసం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News