Defence Minister Rajnath Singh launched NCC training app: న్యూఢిల్లీ: కరోనావైరస్ (Coronavirus) ప్రభావం పలు రంగాలపై విపరీతంగా పడింది. ఇప్పటివరకు విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కాలేదు. దీంతో ఎన్సీసీ శిక్షణ సైతం నిలిచిపోయింది. ఈ మేరకు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ( NCC ) కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. డైరెక్టరేట్ జనరల్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (DGNCC) మొబైల్ ట్రైనింగ్ యాప్‌ను రాజ్‌నాథ్ సింగ్ ( Rajnath Singh) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. Also read: Health Benefits Of Honey: పాలలో తేనె కలిపి తాగితే.. ఎన్నో ప్రయోజనాలు
Launched the Directorate General National Cadet Corps (DGNCC) Mobile Training App today. This App will assist in conducting countrywide online training of the NCC cadets. pic.twitter.com/cYqm7xBZm4
— Rajnath Singh (@rajnathsingh) August 27, 2020
ఎన్సీసీ క్యాడెట్లు డిజిటల్ యాప్ ద్వారా శిక్షణ పొందేందుకు డీజీఎన్‌సీసీ మొబైల్ ట్రైనింగ్ యాప్ ఉపయోగపడుతుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కరోనా నేపథ్యంలో విధించిన నిబంధనల వల్ల ఎన్సీసీ క్యాడెట్లు ప్రత్యక్షంగా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనలేక పోతున్నారని.. ఈ యాప్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చోప్రా తదితరులు పాల్గొన్నారు. Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు