తమిళనాడు ఎన్నికల్లో పోటీపై రజినీకాంత్ సంచలన ప్రకటన

తమిళనాడు ఎన్నికల్లో పోటీపై రజినీకాంత్ సంచలన ప్రకటన

Last Updated : Apr 19, 2019, 04:00 PM IST
తమిళనాడు ఎన్నికల్లో పోటీపై రజినీకాంత్ సంచలన ప్రకటన

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు ట్విస్టులు ఇస్తూవస్తోన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజినీకాంత్ ఇప్పటివరకు అనేక అంశాలపై ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు. అలాగే ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి కూడా దిగలేదు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని రజినీకాంత్ ప్రకటించినప్పుడు ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూసిన వాళ్లంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. 

ఇదిలావుండగా తాజాగా సూపర్ స్టార్ చేసిన మరో ప్రకటన ఆయన అభిమానుల్లో నూతనుత్తేజాన్ని నింపింది. ఇకపై తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. తాను పోటీకి రెడీ అని రజినీకాంత్ ప్రకటించారు. ఒకవేళ మే 23 తర్వాత ఉప ఎన్నికల్లో ఏఐఏడిఎంకే పార్టీకి ప్రభుత్వాన్ని కొనసాగించేంత మద్ధతు లభించని కారణంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే, మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ సూపర్ స్టార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 23 తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని చెబుతూ రజినీకాంత్ తన సమాధానాన్ని ముగించారు.

Trending News