Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడురోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈవిషయాన్ని వాతావరణ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇవాళ ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమోరిన్ ప్రాంతం మరఠ్వాడ, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక వరకు విస్తరించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులపాటు వర్షాలు దంచికొట్టనున్నాయి.
తెలంగాణలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఏపీలోనూ ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావం కొనసాగుతోంది.
దీంతో రాగల మూడురోజులపాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈమేరకు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణి నైరుతి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తాయని స్పష్టం చేసింది. తీరం వెంట పెను గాలులు వీస్తాయని..మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో విచత్ర వాతావరణం కనిపిస్తోంది.
వానాకాలంలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 10 గంటల నుంచే 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ఖమ్మం, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్‌లోనూ ఎండలు అధికంగా ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఐతే సాయంత్రం వేళల్లో చిరుజల్లులు కురుస్తాయని అంటున్నారు.
Subdued rainfall activity over plains of Northwest India and over Central India during next 5 days.
— India Meteorological Department (@Indiametdept) September 4, 2022
Also read:Somu Veerraju: బీజేపీలో జూనియర్ ఎన్టీఆర్ చేరనున్నారా..? సోమువీర్రాజు ఏమన్నారంటే..!
Also read:Guava Benefits: జామ పండు తినడం వల్ల డయాబెటిస్ వారికి కలిగే ప్రయోజనాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి